Begin typing your search above and press return to search.

నాలుగు రిలీజులు ఎందుకులే రాజా!?

By:  Tupaki Desk   |   28 July 2016 3:27 PM GMT
నాలుగు రిలీజులు ఎందుకులే రాజా!?
X
ఒకే ఏడాదిలో ఎక్కువ సినిమాలను విడుదల చేస్తే కాదు.. ఎక్కువ హిట్లు కొట్టడం అనేది ముఖ్యం. అదేదో ఫ్యాన్స్ కోసం కాదండోయ్. ఒక సినిమా ఫ్లాప్ అయితే ప్రొడ్యూసర్ తో పాటు పంపిణీదారులు కూడా నష్టపోతున్నారు. సినిమా బిజినెస్ చచ్చిపోతోంది. దాని వలన ప్రొడక్షన్లు తగ్గుతున్నాయి. సినిమా కార్మికులకు పని లేకుండా పోతోంది. అందుకే హిట్లు అనేవి చాలా ముఖ్యం.

ఈ మధ్య కాలంలో అలా బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టింది నాని ఒక్కడే. ఈ ఏడాది అప్పుడే రెండు సినిమాలు బాగా ఆడగా.. మూడో సినిమా 'మజ్నూ'తో సెప్టెంబర్ లో వచ్చేస్తున్నాడు. ఇప్పుడు సాయిధరమ్ తేజ్ కూడా 'సుప్రీం' తరువాత రెండో సినిమాతో విచ్చేస్తున్నాడు. అయితే 'కృష్ణాష్టమి'తో ఫ్లాపు కొట్టిన సునీల్.. ఇప్పుడు 'జక్కన్న'గా అదృష్టం పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. కాని మనోడు అక్కడితో ఆగట్లేదు. రాబోయే 5 నెలల్లో మరో రెండు సినిమాలు రిలీజైపోతాయి చూస్కోండి అంటున్నాడు. 'వీడు గోల్టేహా' అనే సినిమా.. అలాగే మరో సినిమా కూడా రిలీజవుతాయట. ఏడాదికి నాలుగు రిలీజులు చేయడమే నా టార్గెట్ అంటున్నాడు. ఇదంతా వింటున్న జనాలు మాత్రం.. మరీ నాలుగు ఎందుకులే రాజా అంటున్నారు.

చెయ్యనివ్వండి. ఒకప్పుడు అల్లరి నరేష్‌ ఇలా వరుస సినిమాలతో దూసుకొచ్చి హిట్లు కొట్టేవాడు. ఇప్పుడు సునీల్ అదే టైపులో కొడతానంటే మంచిదేగా. కాకపోతే నాలుగులో మినిమం 3 హిట్టయ్యేలా ఉంటే బెటర్. కౌంట్ కంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హిట్టవ్వడం ఇంపార్టెంట్.