Begin typing your search above and press return to search.

సునీల్ బాబు.. బాగానే పట్టుకొచ్చాడు

By:  Tupaki Desk   |   30 July 2016 10:37 AM GMT
సునీల్ బాబు.. బాగానే పట్టుకొచ్చాడు
X
వరుసగా సునీల్‌ కు మూడు డిజాస్టర్లు ఎదురైనా.. ‘జక్కన్న’ మీద కూడా అంత పాజిటివ్ బజ్ ఏమీ లేకపోయినా.. ఈ సినిమాకు టాక్ కూడా నెగెటివ్‌ గానే ఉన్నా.. ఓపెనింగ్స్ మాత్రం బాగానే రావడం విశేషమే. తొలి రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.3 కోట్లకు పైనే షేర్ రాబట్టినట్లు అంచనా వేస్తున్నారు. సునీల్ స్థాయికి ఇది చాలా పెద్ద మొత్తమే. వరుసగా ఫ్లాపులు ఎదురవుతున్నా సరే.. మాస్ ఆడియన్స్‌‌లో మాత్రం సునీల్ మీద మంచి అంచనాలే ఉన్నాయి. అతడికి ఫాలోయింగ్ కూడా కనిపిస్తోంది. తొలి రోజు హైదరాబాద్‌ లో సింగిల్ స్క్రీన్లలో చాలా చోట్ల హౌస్ ఫుల్స్ పడటం విశేషం.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌ లోని సంధ్య 70 ఎంఎంతో పాటు చాలాచోట్ల హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఐతే మల్టీప్లెక్సుల్లో మాత్రం సునీల్ సినిమాకు అంతగా ఆదరణ లేదు. మార్నింగ్ షోతో టాక్ బ్యాడ్‌ గా రావడంతో తర్వాతి షోకు క్రౌడ్ తగ్గింది. ఈవెనింగ్ షోలకు రెస్పాన్స్ బాగానే ఉంది. రెండో రోజు కలెక్షన్లు డ్రాప్ అవడం గ్యారెంటీ. ఆదివారం లోపు ఓ ఐదు కోట్లు ఖాతాలో వేసుకుంటే బయ్యర్లు కొంత వరకు సేఫ్ అయ్యే అవకాశాలున్నాయి. సునీల్ గత సినిమా ‘కృష్ణాష్టమి’కి కూడా టాక్ బ్యాడ్‌ గానే ఉన్నా.. ఓపెనింగ్స్ మాత్రం బాగా వచ్చాయి. మొత్తానికి సునీల్‌‌ కు మాస్ ఆడియన్స్‌ లో ఆదరణ బాగానే ఉందని అర్థమవుతోంది.