వీరరాఘవుడి విధ్వంసంలో సునీలున్నాడు!

Thu Aug 16 2018 00:32:01 GMT+0530 (IST)

'అరవింద సమేత వీర రాఘవ' టీజర్ రిలీజ్ అయింది. ఎంతో మంది డైరెక్టర్లు ఉంటే మరి త్రివిక్రమ్ స్పెషల్ ఏంటి? యంగ్ టైగర్ ఎన్టీఆర్ పట్టుబట్టి ఎందుకు త్రివిక్రమ్ తో సినిమా చేయాలని అనుకున్నాడు?  'అజ్ఞాతవాసి'  ఫెయిల్యూర్ తర్వాతా కూడా ఎన్టీఆర్ అదే నమ్మకం ఉంచి ఎలా ప్రొసీడ్ అయ్యాడు? ఇలాంటి ప్రశ్నలకు అన్నింటికీ త్రివిక్రమ్ ఒక్క టీజర్ తో గట్టిగా సీమ స్టైల్ లో సమాధానం ఇచ్చాడు.  అర్థం కాలేదా?  టీజర్ లో త్రివిక్రమ్ పేరు వచ్చినప్పుడు TRIVIKRAM లో లాస్ట్ రెండు అక్షరాలను కత్తి నరికినట్టు అలా సౌండ్ వస్తుంది.ఇక ఇప్పటికే ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.  మొత్తం ఎన్టీఆర్ విశ్వరూపమే.  బ్యాక్ గ్రౌండ్ లో జగపతి బాబు గొంతు మాత్రం వినిపించింది.. అఫ్ కోర్స్ ఆ గొంతు ఇంపాక్ట్  మామూలుగా లేదనుకోండి అది వేరే విషయం.   కానీ ఈ టీజర్లో "కంటబడ్డావా… కనికరిస్తానేమో! వెంటబడ్డానా… నరికేస్తా ఓబా"  అనే ఎపిక్ డైలాగ్ చెప్పే ముందు కుర్చీని ఉల్టా పల్టా చేసి అలా రజినీకాంత్ లా స్టైల్ గా కూర్చుంటాడు కదా.. అలా గాల్లోకి లేచి న సమయంలో మీరు జాగ్రత్తగా గమనించండి సునీల్ కనబడతాడు.

త్రివిక్రమ్ సునీల్ కి మంచి ఫ్రెండ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ టీజర్ చూసి అందరూ 'యాక్షన్' అనుకుంటున్నారు.. మరి కామెడి డిపార్టుమెంటు ను తన స్నేహితుడికి అప్పజెప్పారు గురూజీ.. మంచి పాత్రే ఇచ్చి పంచ్ డైలాగులు కూడా రాసి ఉంటారు.  కానీ మనందరం దసరా దాకా ఆగవలసిందే.. ఈ కోపంలో ఉన్న వీర రాఘవుడి పక్కన కామెడీగా పంచ్ లు వేసే సునీల్ ని. మరి ఇది గ్రాండ్ రీ-ఎంట్రీ ఏమో!