Begin typing your search above and press return to search.

సునీల్.. పాతాళానికి భూమికి మధ్యలో

By:  Tupaki Desk   |   27 July 2016 10:30 PM GMT
సునీల్.. పాతాళానికి భూమికి మధ్యలో
X
మర్యాద రామన్న.. పూల రంగడు సినిమాలతో ఒక్కసారిగా హీరోగా చాలా ఎత్తుకు ఎదిగిపోయాడు సునీల్. పూలరంగడు సినిమా బి-సి సెంటర్లలో అదిరిపోయే కలెక్షన్లు సంపాదించడంతో తాను పెద్ద మాస్ హీరో అయిపోయాను అనుకున్నాడు. ఓవర్ కాన్ఫిడెన్స్ తో రెగ్యులర్ మాస్ హీరోల్లాగా తనను తాను ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. దెబ్బకు అంతెత్తు నుంచి దబేల్ మని కింద పడ్డాడు. మిస్టర్ పెళ్లి కొడుకు.. భీమవరం బుల్లోడు.. కృష్ణాష్టమి.. ఒకదాన్ని మించి ఇంకోటి ఫ్లాపయ్యాయి. ఇప్పుడు సునీల్ భూమికి.. పాతాళానికి మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఇంకో దెబ్బ పడిందంటే ఇక పాతాళానికి చేరిపోతాడు. మరి ‘జక్కన్న’ సినిమా సునీల్ ను తిరిగి భూమి మీదికి తెస్తుందా లేకా పాతాళానికి తొక్కేస్తుందా అన్నదే తేలాలి.

సునీల్ గత సినిమాల్లాగే ‘జక్కన్న’ కూడా రొటీన్ గానే కనిపిస్తున్నా.. ఒక్క విషయంలో మాత్రం పాజిటివ్ గా కనిపిస్తోంది. ఇందులో కామెడీ వరకు బాగానే వర్కవుట్ అయినట్లుంది. విడుదలకు ముందు వదులుతున్న కామెడీ ట్రైలర్లు కొంచెం ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మరి ఈ కామెడీతో ‘జక్కన్న’ ఏమాత్రం నెట్టుకొస్తాడో చూడాలి. ఈ వారం ‘పెళ్లిచూపులు’ లాంటి పాజిటివ్ బజ్ ఉన్న సినిమా ‘జక్కన్న’కు పోటీగా విడుదలవుతోంది. ఐతే దాని టార్గెటెడ్ ఆడియన్స్ వేరు కాబట్టి ‘జక్కన్న’కు ఇబ్బంది ఉండదనే భావిస్తున్నారు. ఇంతకీ ‘జక్కన్న’ అయినా సునీల్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందేమో చూడాలి.