Begin typing your search above and press return to search.

సునీల్ అతనిపై బ్లాస్ట్ అయ్యాడు

By:  Tupaki Desk   |   3 Jan 2018 5:57 AM GMT
సునీల్ అతనిపై బ్లాస్ట్ అయ్యాడు
X
టాలీవుడ్ లో ఈ మధ్యకాలంలో ఏ మాత్రం టైం కలిసి రాని హీరో ఎవరు అంటే సునీల్ అనే చెప్పొచ్చు. కేవలం తన ఇమేజ్ మీదే ఓపెనింగ్స్ తెచ్చుకునే స్థాయి నుంచి ఇది సునీల్ సినిమానా - తెలుసుకుని వెళ్దాంలే అనుకునే దాకా మార్కెట్ బాగా పడిపోయింది. అయినా జీవితంలో ఎత్తుపల్లాలు అన్ని సమానంగా చూసినవాడు కాబట్టి ఇప్పుడు తన కెరీర్ డౌన్ ఫాల్ కావడం పట్ల సునీల్ మరీ ఆందోళన చెందటం లేదు. ఇటీవలే ఒక మీడియా ఇంటర్వ్యూలో గతంలో ఎన్నడు చెప్పని కొత్త సంగతులు షేర్ చేసుకున్న సునీల్ దర్శకుడు మారుతి విషయంలో బ్లాస్ట్ అయినంత పని చేసాడు. నానితో తీసిన భలే భలే మగాడివోయ్ లైన్ మొదట మారుతి సునీల్ కే చెప్పాడు. కొన్ని మార్పులు సూచించి డెవలప్ చేయమని సునీల్ చెప్పాక మారుతి ఆ తర్వాత పత్తా లేకుండా పోయాడు. కొంతకాలం గడిచాక అదే నాని హీరోగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

ఇదే విషయాన్నీ మారుతీ ఓ సందర్భంలో గుర్తు చేస్తూ సునీల్ ఆ కథను మహేష్ బాబు ఒక్కడు తరహాలో మార్చమని చెప్పాడని అందుకే తాను చేయలేదని చెప్పాడు. సునీల్ దానికి కౌంటర్ ఇస్తూ మతిమరుపు ఉన్న హీరో కథను ఒక్కడు లాగా చేయమని చెప్పడానికి నేనేమైనా మహేష్ బాబునా అంటూ - అసలు మారుతీ పూర్తి కథ చెప్పకుండా మళ్ళి కలుస్తా అని చెప్పి మాయం అయ్యాడని అంతే తప్ప తాను చేయను అని చెప్పలేదని అని స్పష్టం చేసాడు సునీల్. స్వాతిముత్యం - గుణ తరహాలో పాత్ర ఉంటుందా అని డౌట్ మాత్రమే అడిగానని దానికే మారుతి ఇలా చెప్పడం కరెక్ట్ కాదని సునీల్ క్లారిటీ ఇచ్చాడు. బుద్ధిఉన్న వాడు ఎవరు ఆ కథను వద్దనడు అన్న సునీల్ మారుతీ అబద్దాలు చెప్పాడు అని నొక్కి చెప్పడం విశేషం.

తనకు, త్రివిక్రమ్ కు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు కూడా డబ్బులు లేని స్టేజి నుంచి ఇక్కడి దాకా వచ్చామని - ప్రతి దానికి అతిగా స్పందించడం తన నైజం కాదన్న సునీల్ కళ్యాణ్ రామ్ చేసిన ‘పటాస్’ మాత్రం తన నిర్మాతల రాంగ్ ఎస్టిమేషన్ వల్ల మిస్ అయ్యాయని ఫీల్ అయ్యాడు. ఖైది నెంబర్ 150 మిస్ అవ్వడానికి కారణం కూడా ఈడు గోల్డ్ ఎహే డేట్స్ క్లాష్ కావడం గురించే అని చెప్పి మరో సారి క్లారిటీ ఇచ్చాడు. సైరా - త్రివిక్రమ్-ఎన్టీఆర్ సినిమాల్లో తన రోల్ ఉంటుందని కన్ఫర్మ్ చేసాడు. టైం అంతే. మర్యాద రామన్న టైంలో టికెట్ల కోసం కొట్టుకునే రేంజ్ నుంచి 2 కంట్రీస్ కు కనీసం సగం హాల్ కూడా నిండని స్థితికి లాగేస్తుంది. ఇది సునీల్ కు బాగా తెలుసు కాబట్టి మళ్ళి సపోర్టింగ్ రోల్స్ వైపు డైవర్షన్ తీసుకున్నాడు.