టీజర్ టాక్ః సునీల్ ఇంప్రెస్ చేశాడబ్బా

Fri Nov 24 2017 18:39:16 GMT+0530 (IST)

సునీల్ సినిమాలంటే ఎలా ఉంటాయి? రొటీన్ కామెడీ.. ఊర మాస్ లుక్.. పాత చింతకాయ పచ్చడి టైపులో ఉంటాయి. కాని ఈసారి మాత్రం తేడా కొట్టేసింది. ఎందుకంటే సునీల్ చాలా ఇంప్రెస్ చేస్తూ ఒక టీజర్ తో వచ్చాడు. మైండ్ బ్లోయింగ్ గా ఉందనే చెప్పాలి. పదండి అసలు ఈ టీజర్ కథా కమామిషూ ఏంటో చూద్దాం.ఎన్. శంకర్ ఇప్పుడు మలయాళ చిత్రం '2కంట్రీస్' ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. ఆయనే నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్ ఎప్పటిలాగానే కామెడీ పండించే పాత్రనే చేశాడు కాని.. ఈసారి కామెడీ మాత్రం అదిరిపోయింది. టైమింగ్ అండ్ రైమింగ్ కూడా అదిరాయ్. శ్రీధర్ సీపాన డైలాగ్స్ బాగానే పేలుతున్నాయనే చెప్పాలి. ఇక సునీల్ ప్రక్కనే నటించిన మలయాళ ముద్దుగుమ్మ మనీషా రాజ్ కూడా తన అందాలో పిచ్చెత్తించింది. ఇప్పటివరకు సునీల్ ప్రక్కన చేసిన హీరోయిన్స్ లో ఆర్తి అగర్వాల్ తరువాత అంతటి అందగత్తె ఈమె అనే చెప్పొచ్చు. అలాగే సీనియర్ నటుడు నరేష్.. కమెడియన్ పృథ్వీ కూడా కామెడీ బాగా పండించారు.

మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమా టీజర్ ఎండింగ్ లో ఒక బూతు సెటైర్ ఉంది. ఇండియన్స్ ఈ మధ్యన బాగా పాప్ కార్న్ అయిపోయారు అంటూ మనోళ్ళు షాకిచ్చారు. మొత్తంగా '2 కంట్రీస్' సినిమాతో సునీల్ హిట్టు కొట్టేలాగానే ఉన్నాడు.