Begin typing your search above and press return to search.

కాలంతో సందీప్ కిషన్ 'రన్'

By:  Tupaki Desk   |   12 Feb 2016 3:30 AM GMT
కాలంతో సందీప్ కిషన్ రన్
X
యువ హీరోల్లో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు చేస్తున్న వాళ్లలో సందీప్ కిషన్ కూడా ఒకడు. ప్రస్తుతం ఈ కుర్ర హీరో ఓ మలయాళ మూవీని రీమేక్ చేస్తున్నాడు. మలయాళంలో నివిన్ పౌలీ - నజరియా జంటగా నటించిన నేరం చిత్రాన్ని.. తెలుగులో రీమేక్ చేశాడు. ఈ రీమేక్ కి టైటిల్ ని ఇప్పుడు అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు సందీప్ కిషన్.

తన కొత్త సినిమా పేరు రన్ అని ప్రకటించాడు సందీప్. 'ఇట్స్ ఇఫీషియల్ - నేరం తెలుగు వెర్షన్ కు రన్ అనే టైటిల్ ఫిక్స్ అయింది. సలహాలు ఇచ్చిన, విలువైన సమయం (మా సినిమాలో లాగా)కేటాయించిన అందరికీ కృతజ్ఞతలు.' అంటూ ట్వీట్ చేశాడు సందీప్ కిషన్. ఈ మూవీలో టైంకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. ఈ సినిమా పేరు అదే. మలయాళంలో నేరం అంటే సమయం అనే అర్ధం.

రన్ చిత్రాన్ని మిస్టర్ నోకియా ఫేమ్ అనిల్ కన్నెగంటి దర్శకత్వం వహిస్తున్నాడు. కామెడీ జోనర్ లో ఉండే థ్రిల్లర్ మూవీ ఇది. పిక్సెల్ డ్రీమ్స్ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనిల్ సుంకర సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ లో విడుదల చేసేందుకు యూనిట్ సిద్ధమవుతోంది. మొదట 123 అనే టైటిల్ ని అనుకున్నా.. ఇప్పుడు రన్ అనే పేరుకు ఫిక్స్ అయినట్లు సందీప్ కిషన్ అధికారికంగా అనౌన్స్ చేయడం విశేషం.