సందీప్ చెప్పిన లవర్స్ సీక్రెట్స్

Wed Feb 21 2018 18:44:24 GMT+0530 (IST)

ఎన్నో ఆశలు పెట్టుకుంటే మనసుకు నచ్చింది సినిమా హీరో సందీప్ కిషన్ కు పెద్ద షాకే ఇచ్చింది. అసలే లాస్ట్ ఇయర్ నక్షత్రం ఇచ్చిన ఝలక్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటు ఉంటే మనసుకు నచ్చింది మరో దెబ్బ వేసింది. ఆ మధ్య ప్రాజెక్ట్ జెడ్ అనే మరో సినిమా కూడా చేసాడు కాని అది కూడా నామరూపాలు లేకుండా పోయింది. ఈ నేపధ్యంలో సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలలో పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పాడు సందీప్. తనకు హీరొయిన్లతో ఎఫైర్లు ఉంటాయనే ప్రచారం జరిగిందని అవన్నీ అబద్దాలే అని కొట్టి పారేసాడు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లో చేసిన రకుల్ ప్రీత్ సింగ్ తనకు బెస్ట్ ఫ్రెండ్ అని మంచి కమిట్మెంట్ ఉన్న తన లాంటి నటి అరుదుగా ఉంటారని చెప్పిన సందీప్ తన గురించి వచ్చిన రూమర్స్ ని తీసిపారేసాడు.ఇక రెజినాతో వరసగా నాలుగు సినిమాలు చేయటం వల్ల తనతో కొంత చనువు ఉండేదని అది ఎంత అంటే రెజినా అమ్మాయి కాదు అబ్బాయి అని ఫీల్ అయ్యేంత అని క్లారిటీ ఇచ్చేసాడు. ఇవన్ని మీడియాలో వచ్చిన గాసిప్స్ తప్ప తనకు పర్సనల్ లైఫ్ లో సినిమాలతో సంబంధం లేని ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ ఉండేవారని కాని ఇప్పుడు తనకు వీళ్ళతో లింక్ పెట్టడం మాత్రం తాను అంగీకరించనని చెప్పేసాడు.

ప్రముఖ కెమెరామెన్ చోటా కే నాయుడు తనకు మావయ్య కావడం వల్లే ఇన్ని అవకాశాలు వస్తున్నాయని చెప్పిన సందీప్ ఆయన పనిచేసిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తనకు తొమ్మిదో సినిమా అని గుర్తు చేసాడు. ఆయన్ని సినిమాల కోసం ఇబ్బంది ఏనాడూ పెట్టలేదని చెప్పిన సందీప్ రానున్న సినిమాల పట్ల గట్టి హోప్స్ తోనే ఉన్నాడు. మనసుకు నచ్చింది ప్రేక్షకులకు నచ్చకపోవడంతో మరో ఫ్లాప్ తన ఖాతాలో వేసుకోక తప్పని సందీప్ తమిళ్ లో మాత్రం లాస్ట్ ఇయర్ రెండు హిట్స్ కొట్టడం విశేషం.