ఎర్రటి కళ్ళతో..యువహీరో బెదరగొడుతున్నాడే!

Sat Jun 15 2019 22:14:41 GMT+0530 (IST)

యువ హీరో సందీప్ కిషన్ ప్రస్తుతం తన 'నిను వీడని నీడను నేనే' అనే సినిమాలో నటిస్తున్నాడు.  సందీప్ నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు కార్తీక్ రాజు.  ఎమోషనల్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తాజాగా విడుదల తేదీని ఖరారు చేశారు.  జులై 12 న 'నిను వీడని నీడని నేనే' రిలీజ్ అవుతుందని తెలుపుతూ  ఒక రిలీజ్ డేట్ పోస్టర్ కూడా విడుదల చేశారు.ఈ పోస్టర్ ఇంటెన్స్ గా ఉంది.  సందీప్ కళ్ళు కోపంతో ఉన్నట్టుగా ఎర్రగా ఉన్నాయి.   భుజంపైన రక్తం కూడా ఉంది. సందీప్ మొహానికి ముందు సగం అద్ధమే ఉంది.. అది కూడా పగిలిన అద్దం. నెగెటివ్ టచ్ ఉన్న పాత్ర చేస్తున్నాడో లేదా.. సందీప్ ను ఏదైనా ఆత్మ ఆవహించి ఉందో కానీ తన ఫేస్ లో నెగెటివ్ ఫీల్ ఉంది. సందీప్ లుక్ కూడా గత చిత్రాలకు భిన్నంగా ఉంది.  గతంలో కూడా గడ్డం ఉండేది కానీ ట్రిమ్ చేసిన బియర్డ్ ఉండేది. ఇప్పుడు మాత్రం పెరిగిన గడ్డం లుక్ లో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాడు.  ఈమధ్య హీరోలు గడ్డం పెంచితే చాలు.. హిట్ కొడుతున్నారు. గడ్డం అనేది పాజిటివ్ సెంటిమెంట్ గా మారింది.  సందీప్ కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టున్నాడు.

ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన అన్య సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.  అన్య సింగ్ కు ఇదే డెబ్యూ ఫిలిం. పోసాని కృష్ణ మురళి.. వెన్నెల కిషోర్. రాహుల్ రామకృష్ణ.. మురళి శర్మ ఈ చిత్రంలో ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. థమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.