Begin typing your search above and press return to search.

కబీర్ సింగ్ రివ్యూస్..టాలీవుడ్ హీరో కౌంటర్!

By:  Tupaki Desk   |   22 Jun 2019 4:49 PM GMT
కబీర్ సింగ్ రివ్యూస్..టాలీవుడ్ హీరో కౌంటర్!
X
'అర్జున్ రెడ్డి' రెడ్డి హిందీ రీమేక్ 'కబీర్ సింగ్' బాలీవుడ్ లో ఇప్పుడొక హాట్ టాపిక్. ఈ సినిమా మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ లో దుమ్ము దులిపింది కానీ క్రిటిక్స్ ఇచ్చిన రివ్యూస్ లో మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా కొందరు క్రిటిక్స్ నెగెటివ్ రేటింగ్స్ ఇవ్వడమే కాకుండా ఈ సినిమాలో చాలా లోపాలు ఉన్నాయని హీరో క్యారెక్టర్ లో నెగెటివ్ షేడ్స్ సమాజంపై ప్రభావం చూపిస్తుందని తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక బాలీవుడ్ క్రిటిక్ సినిమాను తీవ్రంగా విమర్శించడమే కాకుండా అసలు 'అర్జున్ రెడ్డి'ని బ్లాక్ బస్టర్ చేసిన తెలుగు ఆడియన్స్ పై కూడా విరుచుకుపడింది. దీంతో టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ కు చిర్రెత్తుకొచ్చి ట్విట్టర్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

"ఒక సినిమాను మీ వ్యక్తిగత అభిరుచిని బట్టి ఎలా ఉందో నిర్ణయించడం ఒక ఎత్తు.. కానీ ఆ సినిమాను ఇష్టపడిన ప్రేక్షకులను ఎలాంటివారో నిర్ణయించడం మాత్రం ఓ పైత్యం. నాకు అర్జున్ రెడ్డి సినిమా చాలా నచ్చింది. ఇప్పటికీ నాది అదే అభిప్రాయం. ఈ విషయంలో నేను ఒక్కడినే కాదు.. తెలుగు ఆడియన్స్ అందరూ ఒకటే" అంటూ ట్వీట్ చేశాడు. దీంతో పాటు తెలుగు నుండి హిందీ కి రీమేక్ చేసి బ్లాక్ బస్టర్స్ అయిన చిత్రాల లిస్టును కూడా జత చేశాడు.

ఇక ఇదొక్కటే కాదు 'కబీర్ సింగ్' పై సోషల్ మీడియాలో నానా రచ్చ కొనసాగుతోంది. క్రిటిక్స్.. విమర్శించే కొందరు ప్రేక్షకులు ఒకవైపు వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటే మరోవైపు కబీర్ సింగ్ సినిమాకు ఫిదా అయిన ప్రేక్షకులు సందీప్ డైరెక్షన్ కు.. షాహిద్ నటనకు జేజేలు పలుకుతున్నారు. కలెక్షన్స్ పరంగా ఈ సినిమా షాహిద్ కెరీర్ బెస్ట్ గా నిలుస్తుందని ట్రేడ్ వర్గాల అభిప్రాయం.