Begin typing your search above and press return to search.

స్పెర్మ్ డొనేషన్‌ చేస్తే..జనాలు డబ్బులిస్తారా???

By:  Tupaki Desk   |   1 Dec 2015 1:30 PM GMT
స్పెర్మ్ డొనేషన్‌ చేస్తే..జనాలు డబ్బులిస్తారా???
X
భారతీయ సినీ పరిశ్రమలో చాలా అడ్వాన్డ్స్ గా ఉండే ఇండస్ట్రీ బాలీవుడ్. వాళ్ల మార్కెట్ చాలా పెద్దది కాబట్టి.. కేవలం మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని టార్గెట్ చేసి సినిమా తీసినా బండి నడిచిపోతుంది కాబట్టి అక్కడ ప్రయోగాలు చేయడానికి బాగా అవకాశముంటుంది. ఆ కోవలో జాన్ అబ్రహాం నిర్మాతగా మారి చేసిన సెన్సేషనల్ ప్రయోగం.. విక్కీ డోనర్. వీర్య దానం (స్పెర్మ్ డొనేషన్) నేపథ్యంలో సూజిత్ సర్కార్ తీసిన ఈ సినిమా బాలీవుడ్ కు దిమ్మదిరిగే షాకిచ్చింది. ఓ వర్గం ప్రేక్షకులకే నచ్చుతుందనుకున్న ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుని సెన్సేషనల్ హిట్టయింది. రూ.5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి రూ.50 కోట్ల దాకా వసూలు చేసింది.

ఐతే బాలీవుడ్ లో కాబట్టి ఈ సినిమా నడిచింది కానీ.. సౌత్ లో ఇది వర్కవుట్ కాదేమో అనుకున్నారు కానీ మన తెలుగు హీరో సుమంత్ మాత్రం ధైర్యంగా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడానికి ముందుకొచ్చాడు. చాన్నాళ్ల కిందటే ఈ వార్త బయటికి వచ్చింది కానీ.. ఈ ప్రాజెక్టు గురించి మళ్లీ అప్ డేట్స్ ఏమీ లేకపోవడంతో పక్కనబెట్టేశారేమో అన్న సందేహాలు నెలకొన్నాయి. కానీ తాజా సమాచారం ఏంటంటే.. విక్కీ డోనర్ తెలుగులోకి రీమేక్ అవుతోంది. మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నాడు. అతనిప్పటికే స్క్రిప్టు రెడీ చేశాడు. హిందీలో హీరో పంజాబీ అయితే, హీరోయిన్ని బెంగాలీగా చూపించారు. వీళ్లిద్దరి మధ్య కల్చరల్ డిఫరెన్సెస్ గురించి సినిమాలో చర్చ నడుస్తుంది. ఈ ఎపిసోడ్ ను తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్చారట. సుమంత్ స్వయంగా నిర్మించే ఈ సినిమా కోసం హీరోయిన్ వేటలో ఉన్నారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుంది.