Begin typing your search above and press return to search.

నాగార్జున-సుమంత్.. ఒక ఆశ్చర్యకర ఫొటో

By:  Tupaki Desk   |   29 Aug 2016 9:51 AM GMT
నాగార్జున-సుమంత్.. ఒక ఆశ్చర్యకర ఫొటో
X
ఏం జరిగిందో ఏమో కానీ.. కొంత కాలగా అక్కినేని నాగార్జున.. ఆయన మేనల్లుడు సుమంత్ కొంచెం దూరం దూరంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఒకరి గురించి ఒకరు మాట్లాడిన సందర్భాలు ఈ మధ్య కనిపించలేదు. ఇలాంటి టైంలో నాగ్ పుట్టిన రోజు వచ్చింది. మేనల్లుడు తన చినమావయ్య మీద ప్రేమను బాగానే చాటుకున్నాడు.

తన చిన్న తనంలో నాగార్జున తనను ఎత్తుకున్న ఫొటో ఒకటి ట్విట్టర్లో షేర్ చేసి ఆశ్చర్యపరిచాడు. సుమంత్ కు ఏడాది లోపు వయసుండగా తీసిన ఫొటో అది. నాగార్జున కూడా అప్పటికి చిన్నవాడే. ఇంకా మీసం కూడా రాలేదు. నాగార్జునను ఇలా చూడటం అభిమానులకు సర్ప్రైజే. దీంతో పాటు తన చినమావయ్యతో కలిసి ఈ మధ్య దిగిన ఒక ఫొటోను షేర్ చేశాడు సుమంత్.

మరోవైపు నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా ఆయన ముఖచిత్రంతో ఒక పోస్టల్ స్టాంపును తపాలా శాఖ విడుదల చేయడం విశేషం. ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలోని స్టిల్ ను ఇందులో వాడారు. నాగచైతన్య.. అఖిల్ ఈ కార్యక్రమానికి హాజరై నాగ్ స్టాంపును లాంచ్ చేశారు. నాగ్ పుట్టిన రోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నారు.