మెగా డాటర్ కి 'హ్యాపీ వెడ్డింగ్'

Fri Sep 22 2017 13:42:13 GMT+0530 (IST)

మెగాడాటర్ నీహారిక పెళ్లి అంటూ ఇప్పటికే కొన్ని రకాల గాసిప్స్ రావడం వాటిని నాగబాబు ఖండించడం జరిగిపోయాయి. అయితే.. ఇప్పుడు అసలు విషయం హ్యాపీ వెడ్డింగ్ అయినా.. అది రియల్ లైఫ్ సంగతి కాదు.. ఇది కొత్త సినిమా కబురు. నీహారిక హీరోయిన్ నటించబోతున్న లేటెస్ట్ మూవీ అనౌన్స్ మెంట్.ఒక మనసు అంటూ హీరోయిన్ గా తొలి చిత్రాన్ని గతేడాది రిలీజ్ చేసిన తర్వాత.. ఆ చిత్రం ఫ్లాప్ కావడంతో.. ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుంది నీహారిక. ఇప్పుడు సుమంత్ అశ్విన్ హీరోగా.. రూపొందనున్న హ్యాపీ వెడ్డింగ్ చిత్రంలో నీహారిక హీరోయిన్ గా నటించబోతోందని అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. ప్రభాస్ ఫ్రెండ్స్ బ్యానర్ అయిన యూవీ క్రియేషన్స్ సమర్పణలో.. పాకెట్ సినిమా నిర్మాణంలో 'హ్యాపీ వెడ్డింగ్' అనే టైటిల్ పై రూపొందనున్న చిత్రంలో.. సుమంత్ అశ్విన్-నీహారిక జంటగా నటించనున్నారు.

ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించనుండగా.. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించనున్నాడు. ఈ చిత్రంలో నరేష్.. మురళీ శర్మ.. పవిత్రా లోకేష.. తులసి.. నిరోషాలు కీలక పాత్రలో నటించనున్నారు. అక్టోబర్ 4 నుంచి హ్యాపీ వెడ్డింగ్ షూటింగ్ ప్రారంభం కానుంది. రొమాంటిక్ జోనర్ లో.. ఫ్యామిలీ ఎంటర్టెయినర్ గా ఈ చిత్రం ఉంటుందని నిర్మాతలు చెబుతున్నారు.