Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: కండలవీరుడు అదరగొట్టాడు

By:  Tupaki Desk   |   25 May 2016 4:10 AM GMT
ట్రైలర్ టాక్: కండలవీరుడు అదరగొట్టాడు
X
బాలీవుడ్ కి ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ మూవీ సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్. బాలీవుడ్ కండలవీరుడు.. తన బాడీని ప్రదర్శించడానికి సరైన వేదికగా సుల్తాన్ ని భలే యూజ్ చేసుకున్నాడు. రెజ్లర్ సుల్తాన్ అలీ ఖాన్ గా సల్లూ భాయ్ ఎంట్రీ నుంచే అదరగొట్టేశాడు. కేవలం ఓ లంగోటీ కట్టుకుని.. ఫీల్డ్ లో సల్మాన్ కుస్తీపట్లు పడుతుంటే.. ఇక ఎవరైనా మూడు నాలుగు గింగిరాలు తిరగాల్సిందే.

ఇక సుల్తాన్ లో మన కండలవీరుడికి జోడీగా అనుష్క శర్మ నటించింది. ఈమె కూడా ఓ ఫిమేల్ రెజ్లర్ రోల్ నే చేస్తోంది. 'ఓ డాక్టర్ మరో డాక్టర్ ని చేసుకోవాలి... అలాగే ఓ రెజ్లర్ మరో రెజ్లర్ ని చేసుకుంటే.. ఆ పట్లు అదిరిపోతాయ్ కదూ' అంటూ సల్మాన్ చెప్పిన డైలాగ్ కేక. ఇక స్టోరీ విషయానికొస్తే.. ఎలాగైనా ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించాలని కలలు కనడం, ఆ డ్రీం ఏమైంది.. ఎందుకు సుల్తాన్ ఆ ఆటకు దూరమయ్యాడు.. తిరిగి మళ్లీ ఫీల్డ్ లోకి ఎందుకు ప్రవేశించాల్సి వచ్చింది. చివరకు విలన్ ను ఎలా మట్టుపెట్టి గెలిచాడు.. ఇదే స్టోరీ.

బాలీవుడ్ ట్రైలర్ ఫార్మాట్స్ ప్రకారం స్టోరీని ముందే పూర్తిగా చెప్పేశారు. ఇందులో సస్పెన్స్ ఏమీలేదు. చూడాల్సిందల్లా... రెజ్లర్ గా సల్మాన్ వీరత్వం - పోరాటమే. అలాగే అనుష్క గ్లామర్ డోస్ కూడా బాగానే ఉంది. ఒకటీ అరా పాటల్లో తన స్టైల్లో డ్యాన్సులు కూడా బాగానే చేశాడు సల్లూ భాయ్. ఈ ఏడాది ఈద్ కానుకగా.. జూలై 6న విడుదల కానుంది సుల్తాన్. ట్రైలర్ తో అదరగొట్టేయడంతో.. ఇప్పుడు సినిమాపై అంచనాలు ఆకాశాన్ని అందుకోవడం ఖాయం.