మహేష్ సుక్కులకు బ్రేక్ పడనుందా?

Mon Feb 11 2019 12:45:26 GMT+0530 (IST)

ఇంకో నెలన్నరలో మహేష్ బాబు మహర్షి షూటింగ్ పూర్తయిపోతుంది. నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఏప్రిల్ 25 అని డేట్ ప్రకటించారు కాబట్టి అందులో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు. ఇప్పటికే 5 నుంచి 25 కు వెళ్లిందని ప్రిన్స్ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తితో ఉన్నారు. దీని షూటింగ్ సమయంలోనే నెక్స్ట్ మూవీ సుకుమార్ తో అని కన్ఫర్మ్ చేసిన మహేష్ కు ఇంకా సబ్జెక్టు ఓకే కాలేదని ఫిలిం నగర్ అప్ డేట్. దీనికి కారణాలు చాలానే ఉన్నాయట.మొదటి చెప్పిన లైన్ మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్న సుక్కు అది ఓకే అవుతుందన్న నమ్మకంతోనే ఎక్కువ సమయం దానికే ఖర్చు పెట్టాడు. దానికి ప్రిన్స్ నో చెప్పడంతో కొత్త స్క్రిప్ట్ వండే పనిలో పడ్డాడు. అయితే మహర్షి ఫినిష్ అయ్యేలోపు అది సిద్ధమయ్యే పరిస్థితి లేకపోవడంతో సుకుమార్ మరో ఆరు నెలలు టైం అడిగినట్టు సమాచారం. అదే నిజమైతే ఎంత లేదన్నా దీపావళికి కాని సిద్ధం కాదు. మరొవైపు సుకుమార్ శిష్యులందరూ ఆయన ఆశీసులతో దర్శకులుగా డెబ్యులు చేస్తున్నారు. ఈయనే దగ్గరుండి మరీ వాటి వ్యవహారలు చూసుకుంటున్నాడు.

ఇది మంచిదే అయినప్పటికీ కీలకమైన తన టీం సభ్యులు డైరెక్టర్లుగా మారడంతో సుక్కుకు కొత్త వాళ్ళను సెట్ చేసుకోవాల్సిన అవసరం పడింది. తన ఐడియాలజితో సింక్ అయ్యే వాళ్ళు దొరికే దాకా సుక్కు రాజీ పడడని ఇన్ సైడ్ టాక్. సో మహేష్ బాబు సినిమా కోసం ఏదో హడావిడిగా తాపత్రయపడి లాభం లేదు. చాలా హోం వర్క్ ఉంటుంది. ఇవన్ని దృష్టిలో పెట్టుకునే సుకుమార్ టైం అడిగాడట. మరి మహర్షి తర్వాత మహేష్ అంత టైం వెయిట్ చేస్తాడా లేక సందీప్ వంగాతోనో ఇంకెవరితో అయినా ప్రొసీడ్ అవుతాడా వేచి చూడాలి