Begin typing your search above and press return to search.

అల్లు అరవింద్, సుకుమార్ కలిసి...

By:  Tupaki Desk   |   9 Feb 2016 1:30 PM GMT
అల్లు అరవింద్, సుకుమార్ కలిసి...
X
అల్లు అరవింద్ - సుకుమార్ కలిసి.. ఇప్పటికైతే సినిమా ఏదీ చేయట్లేదు. భవిష్యత్తులో ఉంటే ఉండొచ్చేమో. ప్రస్తుతానికి ఈ ఇద్దరూ కలిసి ఓ చిన్న సినిమా ఆడియో విడుదల చేశారు. ఆ సినిమానే.. ‘మీకు మీరే మాకు మేమే’. సోమవారం రాత్రి హైదరాబాద్ లో ఈ చిత్ర ఆడియో రిలీజైంది. ఈ వేడుకకు వీళ్లిద్దరూ అతిథులుగా రావడానికి కారణాలు లేకపోలేదు. ‘మీకు మీరే మాకు మేమే’ దర్శకుడు హుస్సేన్ షా కిరణ్ ఇంతకుముందు సుకుమార్ దగ్గర పని చేశాడు. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాకు అతను స్క్రీన్ ప్లే సహకారం అందించాడు. ఇక అల్లు అరవింద్ ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాడు. ఆయన బ్యాకప్ వల్లే సినిమా పట్టాలెక్కింది. ఇప్పుడు మంచి క్రేజ్ కూడా తెచ్చుకుంది.

ఆడియో వేడుకలో అరవింద్ - సుకుమార్ ఈ సినిమా గురించి మంచి మాటలు చెప్పారు. సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని అన్నారు. తరుణ్ శెట్టి - అవంతిక ఇందులో హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, టీజర్ చాలా క్రియేటివ్ గా ఉండి ప్రేక్షకుల్ని ఆకర్షించాయి. ప్రేమలో పడ్డప్పుడు అంతా స్వీట్ గా ఉంటుందని.. ఆ తర్వాతే అసలు కష్టాలు ఎదురవుతాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు కొత్త డైరెక్టర్. తెలుగులో వచ్చిన కొన్ని న్యూ వేవ్ సినిమాల లుక్ ఇందులో కనిపిస్తోంది. సినిమాలో ఓ ఫ్రెష్ నెస్ కనిపిస్తోంది. ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ‘మీకు మీరే మాకు మేమే’. మరి ఈ చిన్న సినిమా ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుంటుందో చూడాలి.