Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: సుకుమార్ - ది ఫ్యామిలీ మ్యాన్

By:  Tupaki Desk   |   22 Sep 2018 12:23 PM GMT
ఫోటో స్టొరీ: సుకుమార్ - ది ఫ్యామిలీ మ్యాన్
X
టాలీవుడ్ లో ఉన్న క్రేజీ డైరెక్టర్లలో ఒకడిగా సుకుమార్ మారిపోయాడు. గతంలో ఇంటెలిజెంట్ ఫిలిం మేకర్ అనే ట్యాగ్ ఉండేది గానీ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ట్యాగ్ మాత్రం 'రంగస్థలం' తర్వాతే వచ్చింది. ఇక సుకుమార్ తన నెక్స్ట్ సినిమాకోసం స్టొరీ రాయడం.. స్క్రిప్ట్ ను తీర్చిదిద్దడంలో బిజీగా ఉన్నాడనే సంగతి తెలిసిందే.

పనిలో పనిగా తన ఫ్యామిలీ తో కలిసి ఫుల్ గా వెకేషన్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. రీసేంట్ గా సుకుమార్ తన వైఫ్ తబిత.. పిల్లలు సుక్రితి - సుక్రాంత్ లతో కలిసి సమయం గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. గజిబిజీ స్క్రీన్ ప్లేలు తయారు చేసి వాటిని అర్థం చేసుకోవాలంటే ప్రేక్షకులకు తప్పని సరిగా గ్రాడ్యుయేషన్ ఉండాలి అనే ఫీలింగ్ ని తెప్పించిన సుకుమార్ ఇప్పుడు ఒక సింపుల్ కామన్ ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోవడం ఫ్యాన్స్ కు సంతోషాన్నిస్తోంది.

ఇక సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కించనున్నాడనే విషయం తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. సుక్కు- మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన '1- నేనొక్కడినే' సినిమాకు విమర్శకుల ప్రశంసలు లభించాయి గానీ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీంతో మహేష్ కు ఎలాగైనా సూపర్ హిట్ అందించాలని పట్టుదలగా ఉన్నాడట.