Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడిని చేస్తాన‌ని మాటిచ్చాను- సుక్కూ

By:  Tupaki Desk   |   21 Jan 2019 7:29 AM GMT
ద‌ర్శ‌కుడిని చేస్తాన‌ని మాటిచ్చాను- సుక్కూ
X
సుకుమార్ శిష్యుడి ముందు ఊహించ‌ని బిగ్ ఛాలెంజ్ ఉందా..? మెగా కాంపౌండ్ హీరోని ఎంపిక చేసుకోవ‌డ‌మే ఓ సాహ‌సం అనుకుంటే.. ఇప్పుడు గోదారి క‌థ‌తో వైష్ణ‌వ్ తేజ్ ని హీరోగా లాంచ్ చేస్తున్నాడు శిష్యుడు బుచ్చిబాబు. ఇది ఓ ర‌కంగా అత‌డికి బిగ్ ఛాలెంజ్ లాంటిదే. ఈ ఛాలెంజ్ లో అత‌డు ఎంత‌వ‌ర‌కూ నెగ్గుకొస్తాడు? అన్న‌ది ఆస‌క్తిక‌రం.

అయితే త‌న శిష్యుడిని పెద్ద ద‌ర్శ‌కుడిని చేస్తాన‌ని ప్రామిస్ చేసిన సుక్కూకి కూడా ఇదో బిగ్ ఛాలెంజ్ అనే చెప్పాలి. మైత్రి సంస్థ‌తో క‌లిసి సుక్కూ రైటింగ్స్ లో ఈ సినిమాని తీస్తున్నాడు సుకుమార్. అందువ‌ల్ల క‌థ విష‌యంలో సుకుమార్ ఎంత‌గానో క‌స‌ర‌త్తు చేశాడు. శిష్యుడితో క‌లిసి క‌థ‌పై చాలానే గ్రౌండ్ వ‌ర్క్ చేశాడ‌ట‌. ఇక ఈ సినిమా కుమారి 21ఎఫ్‌, 100 ప‌ర్సంట్ ల‌వ్ రేంజులో పెద్ద హిట్ అవుతుంద‌ని ఇప్ప‌టికే పాజిటివ్ ఫీల‌ర్స్ ని వ‌దిలింది యూనిట్. ఇక లెక్క‌లు మాస్టారి లాజిక్ శిష్యుడు గురువు ద‌గ్గ‌ర లెక్క‌లు నేర్చుకుని.. ఇప్పుడు డైరెక్ట‌ర్ అయ్యాడు.. కాబ‌ట్టి అంతే ఇదిగా తెర‌కెక్కిస్తాడ‌ని అంతా భావిస్తున్నారు. నేటి ఉద‌యం మెగాస్టార్ క్లాప్, అర‌వింద్ స్విచ్ఛాన్ తో నాన‌క్ రామ్ గూడ‌లో ప్రారంభ‌మైన వైష్ణ‌వ్ తేజ్ ఓపెనింగ్ కార్య‌క్ర‌మంలో సుక్కూ త‌న శిష్యుడికి బ్లెస్సింగ్స్ అందించాడు. అంతేకాదు శిష్యుడైన కాకినాడ బుచ్చిబాబు గురించి భ‌లేగా చెప్పాడు సుకుమార్.

మా అబ్బాయిని నీకే వ‌దిలేస్తున్నాం.. ద‌ర్శ‌కుడిని చెయ్‌.. అని బుచ్చిబాబు అమ్మ గారు సుకుమార్ కి అప్ప‌జెప్పార‌ట‌. దాంతో ద‌ర్శ‌కుడిని చేస్తాన‌ని ప్రామిస్ చేశాడు. కొంత‌కాలంగా సుక్కూ ద‌గ్గ‌ర అసిస్టెంట్ గా ప‌ని చేస్తున్నాడు అత‌డు. అయితే బుచ్చిబాబు ద‌ర్శ‌కుడు అవుతాడా.. అవ్వ‌డా? అన్న భ‌యం, ఆందోళ‌న త‌న‌కు ఉండేవని, అస‌లే భ‌య‌ప‌డుతూ ఉండే త‌న శిష్యుడు.. త‌న‌ని చూస్తేనే అంత దూరం పారిపోయేవాడు.. అలాంటోడు ఈరోజు ద‌ర్శ‌కుడ‌వ్వ‌డం త‌న‌కే ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని అన్నాడు. ఈ సినిమాతో క‌చ్ఛితంగా హిట్ కొట్టేస్తాడ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. ``నా అసిస్టెంట్ డైరెక్ట‌ర్లంద‌రికీ చెబుతుంటాను. ఎవరినీ అసిస్టెంట్ అని అనుకోను. అంద‌రి నుంచి నేర్చుకుంటాను నేను. అయితే బుచ్చిబాబు నా ద‌గ్గ‌ర మ్యాథ‌మెటిక్స్ నేర్చుకున్నాడు. నా శిష్యుడు త‌ను. ఇప్పుడు డైరెక్ట‌ర్ అయ్యాడు. అంతేకాదు నేను కొత్త క‌థ లేనిదే సినిమా చేయ‌ను. నా శిష్యుడు అలాంటి కొత్త క‌థ‌నే రాశాడు. వాడు గొప్ప డైరెక్ట‌ర్ అవుతాడు. ఇక‌పై నేను వాళ్ల ఇంటికి ధైర్యంగా వెళ్ల‌గ‌ల‌ను`` అన్నారు.