Begin typing your search above and press return to search.

రంగస్థలం హిట్టయితే గ్యాంగ్ స్టార్ దిగుతాడు

By:  Tupaki Desk   |   19 March 2018 10:58 AM GMT
రంగస్థలం హిట్టయితే గ్యాంగ్ స్టార్ దిగుతాడు
X
మెగా స్టార్ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల్లో గ్యాంగ్ లిడర్ ఒకటి. 1991లో వచ్చిన ఆ సినిమా మెగాస్టార్ కి మంచి బూస్ట్ ఇచ్చింది. అంతే కాకుండా ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సినిమా మార్కెట్ ను కూడా చాలా పెంచేసింది. ఆ తరువాత మెగా స్టార్ అలాంటి పాత్రలో కనిపించలేదు. ఇంచుమిందు కొంచెం ఆ స్టైల్ లో ఉండే బిగ్ బాస్ చేసినప్పటికీ బోల్తా కొట్టింది. అయితే ఈ సారి మెగాస్టార్ గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో ఉండే ఒక కథను విన్నాడట.

ఆ కథను చెప్పింది ఎవరో కాదు రంగస్థలం దర్శకుడు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుండి మెగాస్టార్ తో సుకుమార్ చాలా క్లోజ్ గా ఉంటున్నాడు. అయితే సుకుమార్ రంగస్థలం సినిమాను తెరకెక్కించిన విధానం చిరంజీవికి చాలా నచ్చేసింది. ఆయనతో వర్క్ చేయాలనే విషయాన్నీ కూడా బయటపెట్టారట. దీంతో గత కొంత కాలం సుకుమార్ అనుకున్న ఒక స్క్రిప్ట్ లోని ముఖ్యమైన పాయింట్స్ ని మెగాస్టార్ కి వివరించాడట.

చరణ్ కి కూడా ఆ గ్యాంగ్ స్టార్ కాన్సెప్ట్ బాగా నచ్చేసిందని సమాచారం. అయితే ప్రస్తుతం మెగాస్టార్ సైరా సినిమా కోసమా కష్టపడుతోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ ఫైనల్ షెడ్యూల్ వచ్చే సమయానికి వేరే కథను ఒకే చేయాలనీ మెగాస్టార్ అనుకుంటున్నారు. అయితే సుకుమార్ గనక రంగస్థలంతో ఆడియెన్స్ ని మెప్పిస్తే తప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని మెగాస్టార్ అనుకుంటున్నారట. మరి రంగస్థలం సినిమా ఎంతవరకు హిట్ అవుతుందో చూడాలి.