Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: ట్యాలెంట్ చూపిస్తున్న దర్శకుడు

By:  Tupaki Desk   |   22 May 2017 4:39 AM GMT
టీజర్ టాక్: ట్యాలెంట్ చూపిస్తున్న దర్శకుడు
X
సుకుమార్ రచన.. నిర్మాణంలో వచ్చిన తొలి మూవీ కుమారి 21ఎఫ్. ఈ చిత్రం హెబ్బా పటేల్ ను క్రేజీ హీరోయిన్ చేసేస్తే.. రాజ్ తరుణ్ కు వరుస అవకాశాలు తెచ్చిపెట్టింది. కమర్షియల్ గా భారీ సక్సెస్ కూడా సాధించింది. ఇప్పుడు సుకుమార్ నిర్మాణంలో వస్తున్న రెండో మూవీ 'దర్శకుడు'.

తాజాగా ఈ చిత్రానికి టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ అనగానే రకరకాల సీన్స్ మిక్స్ చేసి.. కథ ఏంటో తెలీకుండా కలగాపులగం చేసి.. బెస్ట్ సీన్స్ ను మిక్స్ చేయడం మాదిరిగా కాకుండా.. కేవలం ఒక సన్నివేశాన్ని సింపుల్ గా చూపించాడు దర్శకుడు. డైరెక్టర్ సీట్లో ఉంటాడు హీరో అశోక్. ఓ రొమాంటిక్ సీన్ ను షూట్ చేయాల్సి ఉండగా.. హీరోయిన్ ఎక్స్ ప్రెషన్ డైరెక్టర్ కు నచ్చదు. ఎలా చేయాలో తెలీడం లేదని హీరోయిన్ అంటే.. సడెన్ గా పక్కనే ఉన్న హీరోయిన్ ఈషాను దగ్గరగా లాక్కుంటాడు హీరో. 'ఇదీ ఎక్స్ ప్రెషన్ అంటే.. నీ ఫ్రెండ్ ను పెట్టుకోవాల్సింది హీరోయిన్ గా.. అనవసరంగా నిన్ను పెట్టుకున్నా' అంటాడు దర్శకుడు.

ఇటు సినిమా హీరోయిన్ కి సీన్ చూపిస్తూ.. మరోవైపు తన పర్సనల్ లవ్ స్టోరీ నడిపించేశాడన్న మాట. హరిప్రసాద్ జక్కా డైరెక్షన్ లో తెరకెక్కిన దర్శకుడు మూవీలోని ఈ ఒక్క సన్నివేశం చూస్తే.. మూవీ ఎలా సాగనుందో అర్ధమవుతుంది. ఓ దర్శకుడు తన కెరీర్ ప్లస్ లవ్ స్టోరీని ఎలా గెలిపించుకున్నాడన్నదే ఈ దర్శకుడు చిత్ర కథ.