చిట్టిబాబు తర్వాత భరతే నా హీరో

Sun Apr 15 2018 17:48:33 GMT+0530 (IST)

 సుకుమార్ దర్శకత్వ ప్రస్థానం రంగస్థలం ముందు రంగస్థలం తర్వాత అన్నట్టుగా మారిపోయింది. వంద కోట్ల షేర్ తెచ్చే సినిమా అవుతుందని సుకుమార్ అయినా నిజంగా ఊహించాడో లేదో కాని ఇప్పుడు సుక్కు రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సహజంగానే నెక్స్ట్ ఎవరితో చేస్తాడు అనే చర్చ వస్తుంది. చిరంజీవి కోసం ఒక స్క్రిప్ట్ సిద్ధం చేసాడని సైరా తర్వాత అది ఉండే అవకాశాలు ఉన్నాయని కొన్ని వార్తలు వచ్చాయి కాని వాటికి చెక్ పెడుతూ తన తర్వాత సినిమా హీరో ప్రిన్స్ మహేష్ బాబు అని ప్రకటించి సుకుమార్ వాటికి చెక్ పెట్టేసాడు. ఈ ఇద్దరి కాంబోలో గతంలో వన్ నేనొక్కడినే వచ్చింది కాని కమర్షియల్ గా సక్సెస్ సాదించలేక మహేష్ ఫ్లాప్ లిస్టులో ఉండిపోయింది. కాని ఆ సినిమాను అభిమానించే వాళ్ళు చాలానే అది ఎందుకు పరాజయం పాలైందా అని కేస్ స్టడీగా తీసుకున్నవాళ్ళు  ఉన్నారు.రంగస్థలం విడుదల అయ్యాక జరిగిన ప్రెస్ మీట్ లో సుకుమార్ నేనొక్కడినే పరాజయానికి బాధ్యత తీసుకుంటూ ప్రేక్షకులకు అర్థం అయ్యేలా తీయకపోవడం తనదే తప్పని ఒప్పేసుకున్నాడు. కాని ఇప్పుడు రంగస్థలంతో తన అసలు స్టామినా దేనిలో ఉందో తనతో పాటు ప్రేక్షకులు సైతం గుర్తించేలా చేసుకున్న సుకుమార్ మహేష్ తో కొత్త సినిమాని ఎలా రాసుకుంటాడా అనే ఆసక్తి అప్పుడే మొదలైంది. మహేష్ ని ఒకసారి సరిగా ప్రొజెక్ట్ చేయలేదు కనక ఈ సారి అన్ని జాగ్రత్తలు తీసుకుని మరీ తనకు యాప్ట్ అయ్యే కథను సెట్ చేసుకుంటాడు అనడంలో సందేహం అక్కర్లేదు. నిర్మాతగా మైత్రి సంస్థనే వ్యవహరించబోతోంది. శ్రీమంతుడుతో తమ తొలి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యానర్ ఇప్పుడు మరోసారి మహేష్ తో జట్టు కడుతోంది. మహేష్ వంశీ పైడిపల్లితో చేయబోయే తన 25వ సినిమా తర్వాత ఇది సెట్స్ పైకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఆలోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసేసి సుకుమార్ సిద్ధంగా ఉంటాడన్న మాట.