Begin typing your search above and press return to search.

ఈ లెక్కల గోలేంటి సుక్కూ

By:  Tupaki Desk   |   21 Jan 2019 1:00 PM GMT
ఈ లెక్కల గోలేంటి సుక్కూ
X
సుకుమార్‌ కు లెక్కలంటే చాలా ఇష్టం. గతంలో ఆయన లెక్కల మాస్టారిగా పనిచేశాడు. ఆయనకు లెక్కలంటే ఎంత ఇష్టమో ఆయన సినిమాలే చెప్తాయి. చివరకు ఆయనకు పనిచేసే వాళ్లకు కూడా లెక్కలంటే ఇష్టంగా మారిపోయాయి.

దర్శకుడిగా బిజీగా ఉంటూనే సుకుమార్‌ రైటింగ్స్‌ పేరుతో నిర్మాతగా కూడా మారాడు సుకుమార్‌. గతంలో కుమారి 21 ఎఫ్‌ సినిమా తీశాడు. ఇప్పుడు మెగా మేనల్లుడు వైష్ణవ్‌ తేజ్‌ ని పరిచయం చేస్తూ.. తన దగ్గర దర్శకత్వ శాఖలో పని చేసిన బుజ్జిబాబు సాన అనే కుర్రాడ్ని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్‌ చేస్తున్నాడు. ఈ బుచ్చిబాబు మరెవరో కాదు గతంలో సుకుమార్‌ దగ్గర లెక్కలు నేర్చుకున్న వ్యక్తి. అప్పట్లో సుక్కు లెక్కలు చెప్పే విధానం చూసి.. ప్లాట్‌ అయిపోయాడు. అందుకే చదువు అయిపోగానే సుకుమార్‌ దగ్గరకు వచ్చి అసిస్టెంట్‌ గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు సుకుమార్‌ కే మంచి కథ చెప్పి… ఆయన బ్యానర్‌ లో సినిమా చేస్తున్నాడు. ఈ విషయాన్నిసుకుమార్‌ గర్వంగా చెప్పుకున్నాడు.

తన అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ ని సాధారణంగా సుకుమార్‌ శిష్యులు అని చెప్పుకోడు. ఎందుకంటే వాళ్లంతా తనతో పాటు సమానంగా పనిచేస్తున్నారని అంటాడు. కానీ ఇప్పుడు బుచ్చిబాబు తన దగ్గర లెక్కల పాఠాలు నేర్చుకున్నాడు కాబట్టి.. ఇతను నా శిష్యుడు అని గర్వంగా చెప్తున్నాడు సుక్కూ.