Begin typing your search above and press return to search.

సాహో పోస్టర్లు చూసి స్టన్నయిపోయిన డైరెక్టర్

By:  Tupaki Desk   |   27 May 2017 9:22 AM GMT
సాహో పోస్టర్లు చూసి స్టన్నయిపోయిన డైరెక్టర్
X
టెక్నాలజీ పెరిగాక.. సోషల్ మీడియా జోరందుకున్నాక జనాల క్రియేటివిటీకి హద్దులేమీ ఉండట్లేదు. స్టార్ హీరోలకు సంబంధించి ఏదైనా కొత్త సినిమా అనౌన్స్ చేశారంటే చాలు.. అభిమానులు తమ సృజనాత్మకతతో అదిరిపోయే పోస్టర్లు రెడీ చేసేస్తున్నారు. కొన్ని ఫ్యాన్ మేడ్ పోస్టర్లు చూస్తే.. ఇవి ఒరిజనలేమో అని నమ్మేసే పరిస్థితి వస్తోంది. ఆ మధ్య ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ లోగో అంటూ వచ్చిన పోస్టర్.. ఇటీవలే పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ అంటూ ‘ఇంజినీర్ బాబు’ అనే టైటిల్ తో వచ్చిన పోస్టర్ జనాలకు ఇలాంటి ఫీలింగే కలిగించాయి.

తాజాగా ప్రభాస్ అభిమానులు.. అతడి కొత్త సినిమా ‘సాహో’కు సంబంధించి రెడీ చేసిన పోస్టర్లు కూడా ఇలాగే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. స్వయంగా ఈ చిత్ర దర్శకుడు సుజీత్.. ఆ పోస్టర్లు చూసి మురిసిపోవడం.. వీటిని తయారు చేసిన వాళ్ల క్రియేటివిటీని మెచ్చుకోవడం విశేషం. కొంచెం గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలోకి తిరిగొచ్చానని.. ఈ సందర్భంగా ‘సాహో’ పేరుతో స్టన్నింగ్ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు చూశానని ఎగ్జైట్ అవుతూ అందులో కొన్ని అభిమానులతో పంచుకున్నాడు సుజీత్. ఈ పోస్టర్లను చూస్తే సుజీత్ స్టన్ అయిపోవడంతో ఆశ్చర్యమేమీ లేదనిపిస్తుంది.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/