స్టార్ హీరో కూతురి ఫస్ట్ ఫోటో షూట్

Tue Mar 13 2018 15:39:45 GMT+0530 (IST)

మారుతున్న కాలంలో... హీరోల ఆలోచనలను కూడా మారుస్తోంది. కేవలం కొడుకులనే కాదు... కూతుళ్లను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసేలా ఒప్పిస్తోంది. ఇదిగో మొన్నటి తండ్రి చాటు బిడ్డలా పెరిగిన సుహానా... ఇప్పుడు తన తొలి ఫోటో షూట్ కు సిద్ధమైంది. పరిశ్రమకు అవసరమైన ఫ్యాషన్ ను... అందమైన ఎక్స్ పోజింగ్ ను కూడా ఇప్పటికే ఒంటపట్టించేసుకుని సుహానా.చిన్నప్పటి నుంచి తండ్రిని చూస్తూ పెరిగిన ఈ పిల్లకు సినిమాలేంటో ఇష్టం తెలియకుండానే వచ్చేసింది. తల్లి గౌరికి కూడా తన కూతురు హీరోయిన్‌గా చేయాలన్న కోరిక ఉంది. కూతురు... భార్య కోరికను షారూఖ్ కాన్ ఎప్పుడూ కాదనలేదు. సుహానా ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి తొలి అడుగు వేసింది. ఓ బాలీవుడ్ మ్యాగజైన్ కు కవర్ పేజీ కోసం సుహానా ఫోజులిచ్చింది. ఇది ఆమె తొలి సోలో ఫోటో షూట్. ఎప్పుడూ తల్లితో లేదా తండ్రితో కలిపే కనిపించేది. ఇప్పుడామె పెద్దదైంది అని చెప్పేందుకు ఈ ఫోటో షూట్ చాలు. త్వరలో ఏదో ఒక బ్యానర్ లో సుహానా బుక్కవ్వడం ఖాయం. తల్లి గౌరి తన కూతురి మొదటి కవర్ పేజీ ముఖచిత్రం కోసం ఆశగా ఎదురుచూస్తోంది. ఆ కవర్ పేజీ ఫోటో సుహానాకు సినిమా అవకాశాలు కచ్చితంగా తెచ్చిపెడుతుందని ఆమె నమ్మకం.

ఈ ఏడాది స్టార్ నటుల వారసులు బాలీవుడ్ పరిచయం అవ్వబోతున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ... షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్... సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ సినిమా కెరీర్ ప్రారంభించారు. వారి బాటలోనే సుహానా పేరు కూడా త్వరలో జత చేరబోతోంది. ఆమె పక్కన నటించే అవకాశం కొట్టేసే హీరో ఎవరో... బ్యానర్ ఏదో మరి.