Begin typing your search above and press return to search.

తెల్ల క‌లువ‌ల మ‌ధ్య స్పెష‌ల్ క‌లువ‌లా

By:  Tupaki Desk   |   25 Jun 2019 1:30 AM GMT
తెల్ల క‌లువ‌ల మ‌ధ్య స్పెష‌ల్ క‌లువ‌లా
X
బాలీవుడ్ లో న‌ట‌వార‌సుల వెల్లువ గురించి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ల న‌ట‌వార‌సులు బ‌రిలో దిగి ల‌క్ చెక్ చేసుకున్నారు. ఆ క్ర‌మంలోనే కింగ్ ఖాన్ షారూక్ - గౌరీ ఖాన్ ల గారాల పుత్రిక సుహానా ఖాన్ సైతం క‌థానాయిక‌గా ల‌క్ చెక్ చేసుకునేందుకు ప్రిప‌రేష‌న్ లో ఉంది. ఖాన్ డాట‌ర్ ప్ర‌స్తుతం బ్రిట‌న్ లో డిగ్రీ నాలుగో సంవ‌త్స‌రం స్ట‌డీస్ పూర్తి చేసింది. ఈ అక‌డ‌మిక్ సంవ‌త్స‌రం పూర్త‌వ్వ‌గానే వెంట‌నే అన్న ఆర్య‌న్ ఖాన్ తో క‌లిసి న‌ట‌శిక్ష‌ణ తీసుకునేందుకు రెడీ అవుతోంది. మ‌రోవైపు క‌ర‌ణ్ జోహార్ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ సుహానాని తెర‌కు ప‌రిచ‌యం చేసేందుకు ప్రిపేర‌వుతుండ‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

సుహానా మ‌రోవైపు సోష‌ల్ మీడియా ద్వారా ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డంలో జెట్ స్పీడ్ ని ప్ర‌ద‌ర్శిస్తోంది. లైఫ్ సెల‌బ్రేష‌న్స్ కి సంబంధించిన ప్ర‌తి ఫోటోని ప్ర‌తి వీడియోని ఆన్ లైన్ లో షేర్ చేస్తూ వేడి పెంచుతోంది. కాలేజ్ ఫ్రెండ్స్ తో క‌లిసి జాలీ ట్రిప్ లు వెళ్ల‌డం.. వీలున్న ప్ర‌తిసారీ సెల్ఫీలు.. వీడియోల్ని అభిమానుల‌కు షేర్ చేస్తుండ‌డంతో అవి జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. ఇదివ‌ర‌కూ ఓసారి యూకేలోని కాలేజ్ వార్షికోత్సవ వేడుక‌లో డ్యాన్స్ చేస్తున్న కొన్ని సెక‌న్ల‌ వీడియో రిలీజై వెబ్ ని షేక్ చేసింది. తాజాగా కాలేజ్ పార్టీలో సుహానా త‌న స్నేహితుల‌తో క‌లిసి చిలౌట్ చేస్తున్న ఫోటోలు అంత‌ర్జాలంలోకి వ‌చ్చాయి.

ఈ ఫోటోల్లో విదేశీ స్నేహితుల మ‌ధ్య క‌లువ పువ్వులా మెరిసిపోతోంది సుహానా. రెడ్ & బ్లాక్ కాంబినేష‌న్ స్పోర్ట్స్ డ్రెస్ లో త‌ళుక్కుమంది. ఆ గుంపులో తెల్ల క‌లువల సంద‌డి అంతే ఇదిగా ఉంది. స్టైల్ ఐక‌న్ గా త‌న‌ని తాను ఆవిష్క‌రించుకోవ‌డంలోనూ సుహానా ఏమాత్రం త‌గ్గేది లేద‌ని ఈ ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది. ప్ర‌స్తుతం యూత్ ఈ ఫోటోని జోరుగా వైర‌ల్ చేస్తున్నారు. ఇక సుహానా డెబ్యూ మూవీ 2020లో ఉంటుంద‌ని మ‌రోవైపు అభిమానులు భావిస్తున్నారు.