కింగ్ ఖాన్ డాటర్ చింపి ఆరేసింది!

Thu May 23 2019 07:00:02 GMT+0530 (IST)

నటవారసులు లెగసీని ముందుకు తీసుకెళ్లడం అంటే అంత ఆషామాషీనా? అది ఎంత కష్టమో ప్రాక్టికల్ గా ఫేస్ చేసే వాళ్లకే తెలుస్తుంది. అభిమానుల్లో భారీ అంచనాలుంటాయి. వారి నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అన్నిటినీ ఎదురొడ్డి కెరీర్ ని విజయవంతంగా రన్ చేయాలి. అందుకోసం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఎంత చేసినా అదృష్టం కూడా కలిసి రావాలి. ప్రస్తుతం కింగ్ ఖాన్ నటవారసురాలు సుహానా ఖాన్ సన్నివేశం అదే. ఓవైపు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న సుహానా నటన వైపు అడుగులు వేసేందుకు అవసరమైన టిప్స్ తీసుకుంటోంది. సేమ్ టైమ్ పై చదువుల కోసం సన్నాహకాల్లోనూ ఉంది.కింగ్ ఖాన్ నటవారసురాలు త్వరలోనే కథానాయిక అవ్వబోతోంది! అంటూ గత ఏడాది ఆగస్టు నుంచి వాడి వేడిగా చర్చ సాగుతూనే ఉంది. అప్పట్లోనే ప్రఖ్యాత వోగ్ కవర్ పేజీపై సుహానా సొగసుల వడ్డనలు చేయడం ప్రముఖంగా చర్చకొచ్చింది. ఒక రెగ్యులర్ గ్లామర్ క్వీన్ కి ఏమాత్రం తగ్గని రీతిలో సుహానా వేడెక్కించే ఫోటోషూట్ తో వార్తల్లోకొచ్చింది. మామ్ గౌరీఖాన్- డాడ్ షారూక్ సమక్షంలో ఈ ఫోటోషూట్ జరిగిందని సుహానా చెప్పుకొచ్చింది. వోగ్ కవర్ షూట్ ని సుహానా డ్యాన్సులు చేస్తున్నప్పుడు చేయడం మరో ఆసక్తికరమైన విషయం. మొత్తానికి సుహానా రాకకు సమయం ఆసన్నమైంది. అది నేడో రేపో ఎప్పుడైనా రావొచ్చు. అది కూడా డాడ్ వారసత్వాన్ని అందిపుచ్చుకుని కథానాయికగా రాణించేందుకే రెడీ అవ్వడం బిగ్ సర్ ప్రైజ్.

నేడు సుహానా 18వ బర్త్ డే. అంటే 16 ప్రాయం దాటి ఓటేసే వయసొచ్చిందన్నమాట. ఇక టీనేజీ ప్రేమకథల్లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ పడినట్టే. సుహానా పాత రోజుల్లో కాస్తంత పక్కింటి పాపాయమ్మలా కనిపించినా.. మొన్న ఫోటోషూట్ తర్వాత అన్ని డౌట్లు క్లియరైపోయయి. తనకి కథానాయిక అయ్యే అన్ని సలక్షణాలు ఉన్నాయని అందరికీ నమ్మకం కలిగింది. ప్రస్తుతం యవ్వన మిసమిసలతో కుర్రకారు కంటి మీద కునుకు కరువయ్యేలా చేస్తోంది. జాన్వీ.. సారా అలీఖాన్.. అనన్య పాండే.. తారా సుతారియా లాంటి డెబ్యూ నాయికలు ఇప్పటికే పెద్ద తెరపై ప్రవేశించి వెలుగులు చిందిస్తున్నారు. వీళ్ల బాటలోనే సుహానా తెరపై ఏమేరకు రాణిస్తుందో చూడాలి. మరోవైపు సుహానా సోదరుడు ఆర్యన్ ఖాన్ సైతం మగువల గుండెల్లో గుబులు పుట్టించే స్టైల్ తో దూసుకొస్తున్నాడు. అతడి ఎంట్రీ కి కూడా టైమ్ వచ్చినట్టే కనిపిస్తోంది. ఆర్యన్ లాస్ ఏంజెల్స్ లో ఫిలింమేకింగ్ కోర్స్ చేస్తున్నాడు. తనతో పాటే అదే వర్శిటీలో నటనలో షార్ట్ కోర్స్ చేరేందుకు సుహానా ప్లాన్ లో ఉందట.