ఖతర్నాక్ పోజిచ్చిన ఖాన్ సాబ్ డాటర్!

Mon Jun 24 2019 12:57:48 GMT+0530 (IST)

స్టార్ కిడ్స్ అంటేనే చాలు.. ప్రేక్షకుల్లో వారిపట్ల ఒక రకమైన ఆసక్తి ఉంటుంది.  ఒకవైపు నెపోటిజం అని జఫ్ఫాయిజం అని హంగామా జరుగుతూ ఉంటుంది కానీ ఇండస్ట్రీ నిండా ఉండేది స్టార్ కిడ్స్ అయినప్పుడు నెపోటిజం విమర్శలకు విలువ ఎక్కడుంది చెప్పండి?  బాలీవుడ్ లో సల్మాన్.. ఆమిర్ లు స్టార్ కిడ్స్.  ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఇండస్ట్రీలలో సగానికి పైగా స్టార్ కిడ్స్ ఉన్నారు. అందుకే కొత్త జెనరేషన్ స్టార్ కిడ్స్ పై ఎప్పుడూ భారీగా ఫోకస్ ఉంటుంది.  బాలీవుడ్ లో ఈ ఫోకస్ రెండాకులు ఎక్కువే. షారూఖ్ ముద్దుల కూతురు సుహానా ఖాన్ ఒక్క సినిమా కూడా చెయ్యలేదు కానీ ఇప్పటికే సూపర్ పాపులారిటీ ఉంది.సుహానా త్వరలోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోందని ఇప్పటికే బాలీవుడ్ మీడియా  కోడై కూస్తోంది.  ఈ స్టార్ కిడ్ ను పరిచయం చేసే భాద్యత నెపోటిజం పితామహుడు కరణ్ జోహార్ భుజస్కందాలపైనే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా?  ఎంట్రీ ఎప్పుడో.. ఏ సినిమా చేస్తుందో ఇంకా కన్ఫాం కాలేదు కానీ అంతలోపు సోషల్ మీడియాలో మంటలు ఎలా పెట్టాలో అలవాటు చేసుకుంటోంది. తాజాగా సుహానా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  

ఆఫ్ షోల్డర్ గౌన్ లో క్లోజప్ ఫోటో తీసుకోవడంతో సూపర్ హాట్ గా కనిపిస్తోంది. పార్టీ వేర్ కు తగ్గట్టు చేతికి వాచ్ తో పాటుగా స్టైలిష్ బ్రేస్ లెట్స్.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగులు ధరించింది.  రెడ్ కలర్ లిప్ స్టిక్.. సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇవ్వడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోకు సూపర్ కామెంట్లు వచ్చాయి. "బాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు.. మేము వెయిటింగ్".. "సూపర్ హాట్ సుహానా".. "ఫోన్ వాల్ పేపర్ గా పెట్టుకున్నా".."ఖతర్నాక్ పోజు"  అంటూ కామెంట్లు పెట్టారు.  కానీ కొందరు మాత్రం "మీ నాన్న నిన్నేమీ తిట్టడం లేదా?".. "అప్పుడే హాటు డ్రెస్సులు మొదలు పెట్టావా?" అంటూ సెటైర్ లు గుప్పించారు.