సుహానా హాట్ పోజు.. హాట్ టాపిక్!

Mon May 27 2019 12:12:42 GMT+0530 (IST)

బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ కు ముగ్గురు పిల్లలుంటే వారిలో సుహానా ఖాన్ ఒకరు.  సుహానా ఈమధ్యే పంతొమ్మిదో ఏట అడుగుపెట్టింది. అందరూ స్టార్ కిడ్స్ కు మీడియాలో.. సినీ ప్రేమికులలో ఫాలోయింగ్ ఉందో అంతకంటే రెండాకులు ఎక్కువే సుహానాకు ఫాలోయింగ్ ఉంది. సుహానా వేసుకొనే కాస్ట్లీ దుస్తులు.. ఫోన్లు.. వాచ్ ల లాంటి యాక్సెసరీస్ ఒక్కోసారి రోజుల తరబడి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అవుతుంటాయి.  ఒకసారి సుహానా వేసుకున్న ఖరీదైన షూ కూడా అందరి దృష్టిని ఆకర్షించిది.ఇదిలా ఉంటే తాజాగా సుహానా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. బ్లాక్ కలర్ గౌన్ లో ఫోటోకు పోజిచ్చిన సుహానా తన తలను ఒకవైపు అలా ఒంచి ఒక చేతిపై పెట్టుకొని సూటిగా కెమెరాను చూస్తోంది. చేతిలో వాచ్ తో పాటు రెండు మూడు బ్రేస్ లెట్స్..మెడలో ఒక చైన్.. చెవులకు వెడల్పాటి చెవి రింగులు..ఈ హంగామా అంతా న్యూ జెనరేషన్ స్టార్ కిడ్ లాగానే ఉంది.  అయితే సుహానా హాట్ పోజు తో పాటు కాస్త హాటుగా ఉండే ఎక్స్ ప్రెషన్ ఇవ్వడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో భారీ స్పందన దక్కించుకుంది.  

సుహానా తన తండ్రి బాటలో నటనను కెరీర్ గా ఎంచుకున్న సంగతి తెలిసిందే.  బాలీవుడ్ లో హీరోయిన్ గా రాణించాలని కలలు కంటోంది.   ఈ విషయాన్ని స్వయంగా షారూఖ్ కూడా ధ్రువీకరించాడు.  సుహానాను నెపోటిజం పితామహుడు కరణ్ జోహార్ త్వరలోనే హీరోయిన్ గా లాంచ్ చేస్తాడని కూడా బాలీవుడ్ లో టాక్ ఉంది.