Begin typing your search above and press return to search.

విన్నర్ లో రిస్కీ సీన్ చేసిన పిల్లోడు ఎవరో కాదు..

By:  Tupaki Desk   |   26 Feb 2017 6:08 AM GMT
విన్నర్ లో రిస్కీ సీన్ చేసిన పిల్లోడు ఎవరో కాదు..
X
విన్నర్ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ చిన్నప్పటి పాత్రను ఒక చురుకైన పిల్లోడు చేశాడు. చిన్నోడే అయినా పెద్ద సాహసమే చేశాడు షూటింగ్ లో. గుర్రాల మంద ముందు పరిగెత్తే ఒకరిస్కీ షాట్ ను.. అది చాలా క్లోజ్ లో సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన వైనం చాలామంది దృష్టిని ఆకర్షించింది. చురుగ్గా ఉన్న ఆ చిన్నోడు ఎవరన్న ఎంక్వయిరీ కొందరు చేశారు.

ఇప్పుడా పిల్లోడు ఎవరో బయటకు వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ అల్లుడు సుధీర్ బాబు కొడుకే ఈ చిన్నోడు. అంటే.. సూపర్ స్టార్ కి స్వయాన మనమడు అన్న మాట. తాత.. మేనమామల నట వారసత్వం తనలో ఉందన్నట్లుగా.. రిస్కీ షాట్ ను చేసిన ఈ పిల్లాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

కొడుకు ధైర్యాన్ని ట్విట్టర్ లో చెప్పుకొని మురిసిపోతున్నాడు సుధీర్ బాబు. ఈ పిల్లాడు విన్నర్ కు ముందు.. భలే భలే మొగాడివోయ్ చిత్రంలోకూడా నటించాడు. తాజాగా విన్నర్ లో చేసిన రోల్ కి అందరి అప్రియేషన్ లభిస్తోంది. సో.. కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో ఫ్యూచర్ హీరో రెఢీ అవుతున్నట్లేనన్న మాట.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/