చల్ మోహన రంగ.. అదిరింది సామిరంగ

Tue Feb 20 2018 19:10:57 GMT+0530 (IST)

కొంతమంది పొగినట్టే తిడుతూ ఉంటారు. కొండరేమో పొగడ్తలతో కూడా తమ చమత్కారాన్ని చూపిస్తూ ఉంటారు. అలా ఈ మధ్య హీరోలు కూడా చమత్కరించేస్తున్నారు. అందులో ఒకరే సుధీర్ వర్మ. సెలెబ్రెటీల కి ఉండే ఆ అడ్వాంటేజ్ తో థమన్ స్వరపరచిన చల్ మోహన రంగ ఆడియో ను ముందే వినేశాడు సుధీర్. తన చమత్కారంతో థమన్ ను పొగిడే పనిలో పడ్డాడు.నితిన్ హీరోగా రౌడి ఫెల్లో ఫేమ్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో చల్ మోహన రంగ అనే సినిమా చేయబోతున్నాడు. ఇందులో లై లో నితిన్ సరసన నటించిన మేఘా ఆకాష్ ఇందులో కూడా నటిస్తోంది. ఈ సినిమా కు థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తుండగా మొదటి పాట ని త్వరలో రిలీజ్ చేస్తాం అంటూ పోస్ట్ కూడా పెట్టాడు. ఆ పోస్ట్ కి రిప్లై గా సుధీర్ ఆల్రెడీ పాటల్ని వినేసినట్టు చెప్తున్నాడు. "ముందుగానే పాటలని వినే అవకాశం దక్కింది. మ్యూజిక్ చాలా బాగా ఎక్కింది (తాగడంలో కాదు)." అంటూ అర్దం వచ్చేలా పోస్ట్ పెట్టి తన చమత్కారానికి శాంపిల్ చూపించాడు.

థమన్ ఈ మధ్య తన ఆడియోలతో హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. ఆల్రెడీ తొలి ప్రేమ పాటలు బాగా క్లిక్ అయిపోయాయి. ఇప్పుడు చల్ మోహన రంగ కూడా ఇలానే హిట్ అయిపోతే ఇంకా ఎక్కడా తగ్గాల్సిన అవసరమే రాదు థమన్ కి.