Begin typing your search above and press return to search.

పెళ్ళి చూపులు పిల్లకు వర్మ బ్రేకిస్తున్నాడు

By:  Tupaki Desk   |   26 Aug 2016 10:17 AM GMT
పెళ్ళి చూపులు పిల్లకు వర్మ బ్రేకిస్తున్నాడు
X
ముందులో బాద్షా వంటి సినిమాల్లో సైడ్ పాత్రల్లో మెరిసింది రీతూ వర్మ. ఆ తరువాత ప్రేమ ఇష్క్ కాదల్ వంటి సినిమాల్లో ముగ్గురు హీరోయిన్లలో ఒకమ్మాయిగా నటించింది. ఆమె అసలైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న సమయంలో.. సరిగ్గా అప్పుడే సోలో హీరోయిన్ గా ''పెళ్ళి చూపులు'' సినిమా మాంచి లిఫ్టే ఇచ్చిందిలే. మరి పెద్ద లీగ్ లోకి వెళ్ళాలంటే.. ఇక నుండి కొన్ని పెద్ద సినిమాలు కూడా పడాలి. ఆ బ్రేక్ ఎవరిస్తారు?

అదిగో నేనిస్తా అంటూ ముందుకొచ్చాడు వర్మ. అబ్బే రామ్ గోపాల్ వర్మ కాదులేండి.. ''స్వామిరారా'' సినిమాతో లైమ్ లైట్ లోకి వచ్చిన సుధీర్ వర్మ. మనోడు రెండో సినిమాగా ''దోచెయ్'' అంటూ ఒక అట్టర్ ఫ్లాపు తీసినా కూడా.. ఆ తొలిసినిమా తాలూకు ప్రకంపనలు ఇంకా అలాగే కనిపిస్తున్నాయి. అందుకే ఇప్పుడు మరోసారి నిఖిల్ తోనే జతకడుతున్నాడంటే.. ఆటోమ్యాటిక్ గా హైప్ పెరిగింది. ఈ సినిమాలో రీతూ వర్మను నిఖిల్ సరసన తీసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ సినిమా కనుక హిట్టయ్యిందంటే.. ఇక రీతూ వర్మకు బ్రేకొచ్చేసినట్లే.

ఒక్క హిట్టు సినిమా ఏ హీరోయిన్ ఫేటైనా మారుస్తుంది. కాకపోతే ఆ హిట్టు సినిమాతో వచ్చిన క్రేజ్ ను సరిగ్గా క్యాస్‌ చేసుకోవడం తెలుసుకోవాలి. లేకపోతే కొంతమంది భారీ హిట్లు కొట్టినా సదా టైపులో మిగిలిపోతారు.. కొంతమందికి హిట్టే రాకపోయినా తమన్నా టైపులో కుమ్మేస్తుంటారు.