Begin typing your search above and press return to search.

ర‌ణ‌రంగం అంటే మీనింగ్ తెలుసా?

By:  Tupaki Desk   |   13 Aug 2019 7:03 AM GMT
ర‌ణ‌రంగం అంటే మీనింగ్ తెలుసా?
X
శర్వానంద్ క‌థానాయ‌కుడిగా నటించిన తాజా చిత్రం ర‌ణ‌రంగం. క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శన్- కాజ‌ల్ క‌థానాయిక‌లు. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది. సుధీర్ వ‌ర్మ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆగ‌స్టు 15న ఈ సినిమా రిలీజ‌వుతోంది. ఇటీవ‌లే రిలీజైన ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. శ‌ర్వానంద్ గ్యాంగ్ స్ట‌ర్ గా సూట‌వుతాడా? అని సందేహించిన వారికి ఇప్ప‌టికే ట్రైల‌ర్ స‌మాధానం గా నిలిచింది. ఇంత‌కీ ఈ సినిమాలో ప్ర‌త్యేక‌త ఏమిటి? ర‌ణ‌రంగం టైటిల్ మీనింగ్ ఏమిటి? 90ల బ్యాక్ డ్రాప్ ఎందుకు? ఇలా ప్ర‌తిదానికి ద‌ర్శ‌కుడు సుధీర్ వ‌ర్మ తెలుగు మీడియా ఇంట‌రాక్ష‌న్ లో స‌మాధానం ఇచ్చారు.

అస‌లు ర‌ణ‌రంగం అంటే ఏమిటి? అంటే.. `ర‌ణ‌రంగం` అంటే బ్యాటిల్ ఫీల్డ్. ఒక యువ‌కుడి జీవితంలో ఎదురైన స‌మ‌స్య‌ల‌పై పోరాట‌మే `ర‌ణ‌రంగం` అని తెలిపారు. శ‌ర్వా సినిమాల్లో మీకు న‌చ్చిందేంటి? అంటే.. ప్ర‌స్థానం నాకు చాలా ఇష్టం. అందుకే ఇద్ద‌రం క‌లిసి సినిమా చేయాల‌ని అనుకున్న‌ప్పుడు ఇంటెన్సిటీ ఉన్న పాత్ర‌ను ఎంపిక‌ చేయాల‌నే అనుకున్నాం. ఫ్యామిలీ.. ల‌వ్ స్టోరీలు చేయాలనే ఆలోచ‌న లేదు. అందుకే గ్యాంగ్ స్ట‌ర్ స్టోరీని ఎంచుకున్నాం. 1990 నేప‌థ్యం 2016 క‌నెక్టివిటీ ఈ చిత్రంలో క‌నిపిస్తుంది. 90ల‌లో మొబైల్స్ కూడా స‌రిగా లేవు. ఆ కాలంలో వెహిక‌ల్స్ కానీ.. ఇత‌ర‌త్రా అన్నిటికీ సంబంధించి జాగ్ర‌త్త తీసుకున్నాం. వైజాగ్ - ఒరిస్సా బ్యాక్ డ్రాప్.. కాకినాడ పోర్ట్ బ్యాక్ డ్రాప్ ఇవ‌న్నీ ఆ కాలానికి త‌గ్గ‌ట్టే చూపించాం.. అని తెలిపారు.

ఈ క‌థ ర‌వితేజ కు చెప్పారు క‌దా? అన్న ప్ర‌శ్న‌కు .. త‌న‌ని క‌న్విన్స్ చేసి ఒప్పించామ‌ని తెలిపారు. తొలుత ఈ క‌థ‌ను ర‌వితేజ గారికి అనుకున్నాం. ఆయ‌న అప్ప‌టికి రెండు సినిమాల‌తో బిజీగా ఉన్నారు. దానివ‌ల్ల శ‌ర్వానంద్ తో చేయాల్సొచ్చింది. వాస్త‌వానికి శ‌ర్వా నేను క‌థ పై చ‌ర్చించేప్పుడు ఒక రోజు ర‌వితేజ గారికి వినిపించిన లైన్ శ‌ర్వాకి చెప్పాను. `అది నేను చేస్తాను. ర‌వితేజ గారిని క‌న్విన్స్ చేసి చెప్పు` అని శ‌ర్వా అన్నారు. త‌నే న‌న్ను క‌న్విన్స్ చేశారు. ఆ విష‌య‌మే ర‌వితేజ గారికి చెప్పాను. ఆయ‌న‌కు ఈ క‌థ చాలా ఇష్టం. కానీ ఆ టైమ్ లో ఆయ‌న బిజీగా ఉండ‌డం వ‌ల్ల అంగీక‌రించారు. శ‌ర్వాకి లుక్ టెస్ట్ చేశాక సూట‌బుల్ అనుకున్న త‌ర్వాత ఇక వెనుదిరిగి చూడ‌కుండా సినిమా చేశాం.. అని తెలిపారు.

1990 కాలం నాటి క‌థ‌నే ఎందుకు ఎంచుకున్నారు? అంటే.... నాటి వాతావ‌ర‌ణం.. ఆ క్యారెక్ట‌ర్ ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. 1994లో ఎన్టీఆర్ మ‌ధ్య నిషేధం కాలంలో క‌థ న‌డుస్తుంది. రెండేళ్ల త‌ర్వాత చంద్ర‌బాబు ప్ర‌భుత్వం దానిని ర‌ద్దు చేసింది. ఆ కాలంపై ఎవ‌రూ సినిమా చేయ‌లేదు. అప్ప‌టి నేప‌థ్యంలో గ్యాంగ్ స్ట‌ర్ క‌థ ఆక‌ట్టుకుంటుంద‌నిపించి చేశాం అని తెలిపారు. ట్రైల‌ర్ తో స‌క్సెస్ అయ్యాం. సినిమా పెద్ద స‌క్సెస‌వుతుంద‌న్న న‌మ్మ‌కం ఉంది అని వెల్లడించారు.