క్రాంక్ సినిమాకు కేశవ కాపీయా?

Fri May 19 2017 12:12:58 GMT+0530 (IST)

సుధీర్ వర్మ 'స్వామి రా రా' సినిమాతో తన సినీ ప్రస్థానం మొదలుపెట్టాడు. సినిమా అయితే బాగా బిజినెస్ చేసింది కానీ అతను దాని పైన చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. రామ్ గోపాల్ వర్మ సినిమాలును కలిపి మరో సినిమా తీశాడు అని అన్నారు కానీ అతని మేకింగ్ తో ఆ విమర్శను బాగే నెట్టుకువచ్చాడు. కాపీ కొట్టిన షాట్స్ ను అందరి ముందు ఒప్పుకొనే సాహసం కూడా చేశాడు చాలాసార్లు. అతని ధృష్టి లో కాపీ కి ప్రేరణ కి ఏమి తేడా లేదు అంటాడు. ఆ వెంటేనే దోచేయ్ సినిమా తీశాడు.

దోచేయ్ బిజినెస్ పక్కన పెడితే అసలు ఆ సినిమా ‘నౌ దో గ్యారాహ్’ అనే షార్ట్ ఫిల్మ్ నుంచి మక్కీ మక్కీ దించేశాడు అని ఓ పెద్ద దుమారం లేచింది అప్పట్లో. దీనికి సుధీర్ వర్మ వివరణ ఇస్తూ.. నేను అసలు నౌ దో గ్యారాహ్ అనే పేరు కూడా అప్పటివరుకు వినలేదు. నేను బిబిసి టివి సిరీస్ లో వచ్చిన ‘హజిల్’ నుండి ప్రేరణా పొంది తీశాను.. అని చెప్పాడు. ఈ పేరు కూడా చాలామంది కి తెలిసి ఉండదు. వాళ్ళు చెప్పిన సినిమాకి దోచేయ్ సినిమాకు ఎటువంటి సంభందం లేదు. ఇప్పుడు వస్తున్న కేశవ సినిమా కూడా ‘క్రాంక్’ అనే హాలీవుడ్ మూవీ ఆదారంగా తీసిన సినిమాని పుకారు వచ్చింది. కేశవ సినిమా చాలా హాలీవుడ్ సినిమాలు ప్రేరణ తో తీశాను కానీ ‘క్రాంక్’ కు కేశవకు ఎటువంటి పోలికలు ఉండవు” అని చెప్పాడు.

సుధీర్ కేశవ సినిమా గురించి ఇంకా మాట్లాడుతూ   “నా స్థాయి ఫిల్మ్ మేకింగ్ ఇంకా మీరు చూడలేదు అని అతి త్వరలో నేను అనుకున్న మేకింగ్ లో  ఫిల్మ్స్ చేసి చూపిస్తాను అని చెప్పుతూ ఈ సినిమా నిఖిల్ సినిమా కెరీర్ లో మంచి సినిమాగా మిగిలిపోతుంది అని చెప్పాడు. కేశవ సినిమాకు సినిమాటోగ్రాఫి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వలన సినిమాకు మరింత శక్తి వచ్చింది. ఈ రెండు చాలా స్పెషల్ గా నిలుస్తాయి అని నమ్మకంగా చెప్పాడు. ఈ సినిమా నిడివి 1.56 గంటలు ఉంటుంది. చూసిన ప్రతీ ఫ్రేమ్ ప్రేక్షకులుకు మంచి థ్రిల్ నిస్తుంది అని చెప్పాడు.”

ఈరోజే కేశవ సినిమా రిలీజైంది. రివ్యూ కోసం మా కాలమ్న్ చెక్ చేసుకోండి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/