దాన్ని ప్రేమిస్తే దీన్ని పెళ్లి చేసుకుంటారు

Sun Aug 13 2017 23:00:52 GMT+0530 (IST)

ఇక్కడ దాన్ని దీన్ని అంటూ ఎవరో ఒక అమ్మాయి గురించి చులకను మాట్లాడటం లేదయ్యా. యాజిటీజుగా మన సిక్స్ ప్యాక్ స్టార్ సుధీర్ బాబు ఏం చెప్పాడో అదే చెబుతున్నాం అంతే. ఇప్పుడు తన కొత్త సినిమా షూటింగులో బిజీగా ఉన్న ఈ 'భలే మంచి రోజు' హీరో.. ఒక కొత్త సినిమా గురించి కొత్త మాట చెప్పాడు. పదండి అదేంటో చూద్దాం.ఈరోజు తాప్సీ హీరోయిన్ గా శ్రీనివాస్ రెడ్డి మెయిన్ లీడ్లో చేస్తున్న ''ఆనందో బ్రహ్మ'' సినిమా స్పెషల్ షో ఒకటి వేశారట. ఈ కార్యక్రమానికి విచ్చేసిన హీరో సుధీర్ బాబు.. సినిమా చూసి షాకైపోయాడట. వెంటనే ఒక మాటనేశాడు. ''మీకు ప్రేమ కథా చిత్రం బాగా నచ్చే ఉంటుంది. మీరు ఆ సినిమాను ప్రేమిస్తే ఈ ఆనందో బ్రహ్మ సినిమాను పెళ్ళిచేసుకుంటారు. అంత బాగుంది. అసలు ఈ హారర్ కామెడీతో ఆపకుండా నవ్వుతారు. కడుపు నొప్పిరాకుండా టాబ్లెట్ తీసుకెళ్ళండే'' అంటూ కామెంట్ చేశాడు సుధీర్.

మహి వి రాఘవ్ డైరక్షన్లో రూపొందిన ఆనందో బ్రహ్మ సినిమా ఆగస్టు 18న రిలీజవుతోంది. ఇప్పుడు సుధీర్ బాబు వంటి నటులు ఈ సినిమాకు ఇస్తున్న కితాబులు చూస్తుంటే.. సినిమాకు గాట్టి ఓపెనింగ్స్ పట్టేశాలానే ఉన్నారు. కాకపోతే తాప్సీ గ్లామర్ చూడా్డనికి వెళితే మాత్రం డిజప్పాయింట్ అవ్వక తప్పదు. ఇక్కడ ఓన్లీ హారర్ కామెడీ అంతే.