Begin typing your search above and press return to search.

బాఘీ విలన్ తో బయోపిక్ కి సిద్ధం

By:  Tupaki Desk   |   25 May 2016 7:30 AM GMT
బాఘీ విలన్ తో బయోపిక్ కి సిద్ధం
X
బాలీవుడ్ లో ఇప్పుడు బయోపిక్ లు బాగా జోరు చూపిస్తున్నాయి. అందుకే తెలుగులో రూపొందించాలని మొదలైన ఓ స్క్రిప్ట్.. ఇప్పుడు బైలింగ్యువల్ టర్న్ తీసుకుంది. భారత క్రీడారంగంలో, ముఖ్యంగా బ్యాడ్మింటన్ స్పోర్ట్ లో పుల్లెల గోపీచంద్ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. స్వయంగా తనే ఎన్నో విజయాలు సాధించడమే కాదు.. తన ట్రైనింగ్ లో ఎంతోమందిని విజేతలుగా నిలిపిన చరిత్ర గోపీచంద్ ది.

ఈ స్పోర్ట్స్ బేస్డ్ బయోపిక్ ని సుధీర్ బాబు హీరోగా రూపొందించేందుకు సిద్ధమయ్యాడు గుంటూరు టాకీస్ దర్శకుడు ప్రవీణ్ సత్తారు. బాఘీలో విలన్ రోల్ తర్వాత బాలీవుడ్ లోనూ సుధీర్ కి క్రేజ్ పెరగడం, అక్కడ బయోపిక్ లకు విపరీతమైన ఆదరణ లభిస్తుండడంతో.. గోపీచంద్ జీవితంపై తీసే సినిమాను.. బై లింగ్యువల్ తీయాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అలాగే మేకింగ్ సమయంలోనే ఓ ఇంగ్లీష్ వెర్షన్ ని కూడా రెడీ చేయాలని భావిస్తున్నారట.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్ పూర్తయ్యాక.. సుధీర్ బాబు, పుల్లెల గోపీచంద్ లు కూడా తమ అభిప్రాయాలను చెప్పాల్సి ఉంటుంది. ఇవన్నీ పూర్తయి.. సెట్స్ పైకి వెళ్లేందుకు మరికొన్ని నెలలు సమయం పడుతుందని తెలుస్తోంది.