Begin typing your search above and press return to search.

గోపీచంద్ బయోపిక్ కి డైరెక్టర్ ఫిక్స్

By:  Tupaki Desk   |   2 May 2016 4:26 AM GMT
గోపీచంద్ బయోపిక్ కి  డైరెక్టర్ ఫిక్స్
X
ప్రస్తుతం దేశంలో స్పోర్ట్స్ పర్సనాలిటీస్ కు చెందిన బయోపిక్ ల సీజన్ బాగానే నడుస్తోంది. ఇప్పటికే మిల్కా సింగ్, పాన్ సింగ్ తోమర్, మేరీకోమ్ ల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ప్రేక్షకుల ఆదరణ పొందగా.. ఇప్పుడు అజార్ - ధోనీ - సచిన్ ల బయోపిక్ లు కూడా వచ్చేస్తున్నాయి. బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్ పై కూడా ఓ మూవీకి రంగం సిద్ధమవుతోంది.

గోపీచంద్ బయోపిక్ లో నటిస్తానంటూ గతంలో ఓ సారి చెప్పాడు రీసెంట్ గా బాలీవుడ్ అరంగేట్రం చేసిన సుధీర్ బాబు. గుంటూరు టాకీస్ మూవీతో కమర్షియల్ హిట్ కొట్టిన ప్రవీణ్ సత్తారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనుండడం విశేషం. మొదట ఇంద్రగంటి మోహన్ కృష్ణను దర్శకుడిగా అనుకున్నా ఇప్పుడు ప్రవీణ్ కే మొగ్గు చూపాడు సుధీర్ బాబు.

తాను గతంలో బ్యాడ్మింటన్ ప్లేయర్ కావడం గోపీచంద్ బయోపిక్ లో నటించేందుకు అడ్వాంటేజ్ అవుతుందన్న సుధీర్ బాబు.. బాలీవుడ్ తనను ఆదరించిన తీరుకు ఆశ్చర్యపోయానని చెబుతున్నాడు. గోపీచంద్ మూవీని హిందీలో కూడా తప్పనిసరిగా విడుదల చేస్తామని చెప్పాడు సుధీర్ బాబు. ప్రతీ స్టెప్ తీసుకునే ముందు మహేష్ బాబు భార్య నమ్రతతో పాటు రాణాను కూడా సంప్రదిస్తున్నానని అన్నాడు సుధీర్.