కొత్త అవతారంలో మహేష్ బావ

Fri Oct 13 2017 09:59:08 GMT+0530 (IST)

మహేష్ బాబుకి బావగా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు సుధీర్ బాబు. యంగ్ హీరోస్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కూడా సంపాదించుకున్నాడు. ప్రేమకథా చిత్రం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆ స్థాయి విజయం సాధించలేకపోయినా.. మంచి సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు. రీసెంట్ గా శమంతక మణి అంటూ కుర్రాళ్ల మల్టీ స్టారర్ లో నటించాడు సుధీర్ బాబు.ఈ యంగ్ హీరో ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నాడని తెలుస్తోంది. తన కొత్త చిత్రానికి తనే నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట. రీసెంట్ గానే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కాగా.. రాజశేఖర్ నాయుడు ఈ మూవీ ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేయబోతున్నాడు. నిజానికి ఈ చిత్రాన్ని వేరే నిర్మాతతోనే తలపెట్టారట. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. కానీ చివరి నిమిషంలో ఆ నిర్మాత వెనక్కు తప్పుకోవడంతో.. ఈ మూవీని తనే నిర్మించాలని ఫిక్స్ అయిపోయాడట సుధీర్ బాబు.

మూవీ కంటెంట్.. సబ్జెక్ట్.. కొత్త దర్శకుడిపై ఉన్న నమ్మకంతో ఇటు హీరోగా చేస్తూనే అటు ప్రొడక్షన్ కూడా చేసేయాలని సుధీర్ బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ చిత్రంలో.. కన్నడ భామ నాభా నతేష్ హీరోయిన్ గా నటించనుంది. ఈ బ్యూటీ ఇప్పటికే రవిబాబు మూవీ అదుగో చిత్రంలో నటించి.. విడుదల కోసం వెయిట్ చేస్తోంది.