Begin typing your search above and press return to search.

ఆ సీన్‌ సినిమా స్థాయిని పెంచేసింది!

By:  Tupaki Desk   |   22 Sep 2018 4:54 PM GMT
ఆ సీన్‌ సినిమా స్థాయిని పెంచేసింది!
X
సుధీర్‌ బాబు హీరోగా నభా నటేష్‌ హీరోయిన్‌ గా తెరకెక్కిన చిత్రం ‘నన్నుదోచుకుందువటే’. ఈ చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. విడుదలైన మొదటి రోజు ఈ చిత్రంకు మంచి స్పందన దక్కింది. సినిమాకు పాజిటివ్‌ రివ్యూలు రావడంతో పాటు మొదటి రోజు మంచి వసూళ్లు కూడా దక్కాయి. సినిమాకు వారాంతంలో మరింతగా మంచి వసూళ్లు వస్తాయని చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.

ఇక ఈ చిత్రంలోని ఒక సీన్‌ గురించి ప్రస్తుతం ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకులు తెగ చర్చించుకుంటున్నారు. సుధీర్‌ బాబు ఈ చిత్రంలో ఒక సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో సీరియస్‌ మేనేజర్‌ గా నటించాడు. చండసాసనుడైన మేనేజర్‌ పాత్రలో సుధీర్‌ బాబు మంచి నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్‌ కోసం ఒక షార్ట్‌ ఫిల్మ్‌ లో సదరు మేనేజర్‌ నటించాల్సి వస్తుంది. ఆ సీన్‌ లో సుధీర్‌ బాబు నటన నవ్వులు పూయించింది. నటనలో బేసిక్స్‌ తెలియని వ్యక్తిగా ఫేస్‌ ఫీలింగ్స్‌ పెట్టి - డైలాగ్‌ చెప్పే ఆ సీన్‌ బాగా పేలింది. ఇలాంటి ఒక సీన్‌ ను రాసినందుకు డైరెక్టర్‌ పై కూడా ప్రశంసల జల్లు కురుస్తుంది. ప్రేక్షకులు ఆ సీన్‌ ను తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తు అయితే - ఆ కామెడీ సీన్‌ ఒక ఎత్తు అంటూ ప్రేక్షకులు కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆ సీన్‌ తో పాటు మరికొన్ని కామెడీ సీన్స్‌ కూడా ప్రేక్షకులను నవ్విస్తున్నాయి. సుధీర్‌ బాబు నిర్మాతగా మారి మొదటి సారి ఈ చిత్రంను నిర్మించడం జరిగింది. గత చిత్రాల ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని సుధీర్‌ బాబు ఒక మోస్తరు బడ్జెట్‌ తోనే ఈ చిత్రాన్ని నిర్మించినట్లుగా సమాచారం అందుతుంది. తక్కువ బడ్జెట్‌ అవ్వడంతో పాటు సక్సెస్‌ టాక్‌ ను దక్కించుకున్న కారణంగా ఈ సినిమాతో సుధీర్‌ బాబుకు లాభాలు భారీగానే వచ్చే అవకాశం ఉందని ట్రేడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.