Begin typing your search above and press return to search.

మారువేషం లో మహేష్ బావ!

By:  Tupaki Desk   |   22 Sep 2018 11:59 AM GMT
మారువేషం లో మహేష్ బావ!
X
ఒక సినిమా విజయం సాధించాలంటే కంటెంట్ మాత్రమే సరిపోతుందనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. కంటెంట్ తో పాటుగా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్ళేదానికి స్ట్రాంగ్ ప్రమోషన్స్ చాలా అవసరం. ఇక బాలీవుడ్ స్టార్స్ ఈ విషయంలో చాలా ముందే ఉంటారు. అమీర్ ఖాన్ లాంటి వాళ్ళు వింత వింత గెటప్స్ వేసుకొని ప్రేక్షకుల్లోకి వెళ్లి సినిమాకు భారీ ప్రచారం కల్పించిన సందర్భాలు ఉన్నాయి.

ఇక తెలుగు హీరో సుధీర్ బాబు కూడా అమీర్ ఖాన్ రూట్ ఫాలో అవుతూ వెరైటీ గెటప్ వేసుకొని తన తాజా చిత్రం 'నన్ను దోచుకొందువటే' కోసం ప్రమోషన్స్ చేస్తున్నాడు. మారువేషంలో 'నన్ను దోచుకొందువటే' ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్ళే కార్యక్రమం మొదలు పెట్టాడు. అక్కడ ప్రేక్షకులు సినిమా గురించి ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకుంటున్నాడు. అందరూ గుర్తుపట్టలేకపోవచ్చు గానీ కొంతమంది గుర్తు పడతారు కదా. అలాంటి వారితో సెల్ఫీలు.. ఫోటోలు దిగుతూ వారిని ఆనందపరుస్తున్నాడు. ఎవరూ గుర్తుపట్టక పొతే మాత్రం అక్కడినుండి సైలెంట్ గా వెనక్కి వచ్చేస్తున్నాడట.

శనివారం రోజు హైదరాబాద్ సిటీలోని సినిమా హళ్ళలో ఈ కార్యక్రమం మొదలుపెట్టి చాలా థియేటర్లు కవర్ చేశాడట. హైదరాబాద్ మాత్రమేనా.. అని ఆంధ్ర.. సీడెడ్ ఏరియాల వారు బాధపడవలసిన అవసరం లేదు. అక్కడ కూడా మారువేషంలో పర్యటిస్తాడట. కానీ ఏ థియేటర్లలో సుధీర్ బాబు ఏ సమయంలో ప్రత్యక్షమౌతాడో మాత్రం తెలీదు. అదంతా సీక్రెట్. ఈ ప్రోగ్రామ్ తో సుధీర్ బాబు టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ మొదలుపెట్టాడు. ఇక దీనివల్ల కలెక్షన్స్ లో ఎలాంటి ఇంప్రూవ్ మెంట్ ఉంటుందో వేచి చూడాలి.