Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్ : భలే మాంచి కిడ్నాప్ డ్రామా

By:  Tupaki Desk   |   25 Nov 2015 7:07 PM GMT





సుధీర్ బాబు, వామిక జంటగా నటించిన భలే మంచి రోజు ట్రైలర్ రిలీజ్ అయింది. ఓ వ్యక్తి జీవితంలో ఒక రోజు జరిగిన సంఘటనలే బేస్ గా చేసుకుని ఈ మూవీ తీస్తున్నామని ముందే చెప్పాడు డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య. ఆ ఒక రోజుని ఎంత పర్ఫెక్ట్ గా చూపించారనే విషయం.. ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ముఖ్యంగా డైలాగ్స్ కూడా సూపర్బ్ గా కుదిరాయి.


"సిగరెట్ తాగితే కేన్సర్ వస్తుందని తెలుసు, మందు తాగితే లివర్ చెడుతుందని తెలుసు, కానీ జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని ఎవరికి తెలుసు" అంటూ ట్రైలర్ స్టార్టింగ్ లోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. అక్కడి నుంచి వరుసగా కేరక్టర్స్ పరిచయం, ఛేజింగ్ లు, కామెడీ, ఫైటింగ్ లు, మంచి విజువల్ ట్రీట్ లాంటి సాంగ్స్ తో ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా సాయికుమార్ అయితే చెలరేగిపోయాడనే చెప్పాలి. హీరోయిన్ రోల్, ఆ పాత్ర చేసిన వామిక కూడా మంచి ఎఫెక్టివ్ గా ఉన్నారనే చెప్పాలి.

చివరి వరకూ హీరోయిన్ కిడ్నాప్ డ్రామాని రసవత్తరంగా చూపించడంతోపాటు.. ఆఖర్లో వేసిన పంచ్ కూడా అదిరింది. జీవితంలో చివరి నిమిషానికి 60 క్షణాలు ఉండవ్ అని కామెడీ కిడ్నాపర్ అంటే.. రాత్రి పది దాటితే వైన్ షాపులు కూడా ఉండవ్.. అయితే ఏంటి సాయికుమార్ విసుక్కోవడం మరీ బాగుంది. మొత్తం మీద భలే మంచి రోజు ప్రామిసింగ్ గానే కనిపిస్తోంది.