Begin typing your search above and press return to search.

పవన్ ప్లేస్ లో ఉప్పీ దాదా

By:  Tupaki Desk   |   11 Feb 2016 11:30 AM GMT
పవన్ ప్లేస్ లో ఉప్పీ దాదా
X
తెలుగు సినిమాలంటే కన్నడ జనాలకు భలే ఇష్టం. ఇక్కడి సినిమాలను నేరుగా చూసేయడమే కాదు.. రీమేక్ లను కూడా విపరీతంగా ఆదరించేస్తూ ఉంటారు. తెలుగు నుంచి కన్నడకు విపరీతంగా రీమేక్స్ జరుగుతూ ఉంటాయి. కానీ ఈ మధ్య ఈగ విలన్ సుదీప్ ఈ రీమేక్ లను బాగా యూజ్ చేసుకుంటున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అత్తారింటికి దారేదిని.. కన్నడలో రీమేక్ చేశాడు కిచ్చా సుదీప్. ఈ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టేసి టాప్ హీరో రేంజ్ కి చేరుకున్నాడు. ఇప్పుడు మరోసారి పవన్ చేసిన సినిమాపైనే కన్నేశాడు ఈ హీరో కం విలన్. గతేడాది తెలుగులో వచ్చిన గోపాలా గోపాలా చిత్రం.. హిందీ మూవీ ఓ మై గాడ్ కు రీమేక్. హిందీలో అక్షయ్ కుమార్ - పరేష్ రావల్ చేసిన పాత్రలను.. తెలుగులో పవన్ కళ్యాణ్ - వెంకటేష్ లు చేశారు. ఈ మూవీ ఇక్కడ బ్లాక్ బస్టర్ అనలేం కానీ.. మంచి హిట్ గానే నిలిచింది. ఇఫ్పుడీ చిత్రాన్ని కన్నడలోకి తీసుకెళ్లాలని సుదీప్ ఫిక్స్ అయ్యాడు.

ముకుంద మురారి అనే టైటిల్ తో ఈ కన్నడ సినిమా చిత్రీకరణ జరపుకోనుంది. అయితే.. మరోసారి పవన్ సినిమానే ఎంచుకున్న సుదీప్.. రోల్ మాత్రం పవన్ ది కాకుండా.. వెంకీ పాత్రకి షిఫ్ట్ అయ్యాడు. ఈ చిత్రంలో పవన్ పోషించిన పాత్రను.. విభిన్న చిత్రాల హీరో కం నిర్మాత కం డైరెక్టర్ కం.. ఉపేంద్రతో చేయించనున్నారని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం.. రిలీజ్ కి ముందే పెద్ద సంచలనం అవుతుందని టాక్ వినిపిస్తోంది.