ఇంప్రెస్ చేస్తున్న లేడీ డైరక్టర్లు

Sat Jan 13 2018 23:00:01 GMT+0530 (IST)

ఏ రంగంలో అయినా సత్తా చాటగల బహుముఖ ప్రజ్ఞాశాలులం తాము అని నిరూపించుకుంటూనే ఉన్నారు మహిళలు. మిగిలిన రంగాలతో పోల్చితే సినీ రంగంలో కెప్టెన్ హోదా ఎక్కువగా మగవారి చేతుల్లోనే ఉంటోంది. దర్శకత్వపు బాధ్యతలను సమర్ధంగా నిర్వహించిన మహిళలు గతంలోనూ ఉన్నా వారి సంఖ్య తక్కువే. ఇప్పుడు పలువురు మహిళలు తెలుగు సినిమా దర్శకులుగా వెలిగిపోతున్నారు. వారి కంటెంట్ తో కూడా బాగా ఇంప్రెస్ చేస్తున్నారు.ఘట్టమనేని మంజుల.. శ్రీరంజని.. సంజనా రెడ్డి.. సుధ కొంగర.. ఇలా పలువురు మహిళలు లేడీ డైరెక్టర్లుగా ట్యాలెంట్ చూపించేస్తున్నారు. గతంలో నటిగా.. నిర్మాతగా వ్యవహరించిన మంజుల.. ఇప్పుడు మనసుకు నచ్చింది మూవీతో దర్శకురాలిగా తన ప్రతిభను చాటబోతున్నారు. తాను సూపర్ స్టార్ కృష్ణ కూతురు అయినా.. అంత సులువుగా అవకాశాలను దక్కించుకోలేదనే విషయాన్ని ఆమె గుర్తు చేస్తున్నారు. అయితే.. ప్రతిభ ఉంటే గుర్తింపు ఎప్పటికైనా లభిస్తుందని చెబుతున్నారామె. కోలీవుడ్ ఫిలిం మేకర్ సెల్వ రాఘవన్  కు బంధువు అయిన శ్రీరంజని.. రంగుల రాట్నం చిత్రంతో ప్రేక్షకులను రేపే పలకరించనున్నారు. తాను ఎందరికో కథ చెప్పగా.. అనేకమంది కనీసం రెస్పాన్స్ ఇవ్వలేదన్న ఆమె.. రాజ్ తరుణ్ హీరోగా సినిమా చేసినట్లు తెలిపారు.

ఇదే రాజ్ తరుణ్.. సంజనా రెడ్డి అనే దర్శకురాలితో రాజుగాడు చేస్తుండడం విశేషం. వెంకటేష్ తో గురు చిత్రం చేసి సక్సెస్ సాధించారు సుధ కొంగర. అటు కుటుంబం.. ఇటు కెప్టెన్ హోదా.. రెండిటినీ బ్యాలెన్స్ చేయగల మల్టీటాస్కింగ్ ట్యాలెంట్ మహిళల సొంతం అంటున్నారు ఈ లేడీ కెప్టెన్స్.