Begin typing your search above and press return to search.

కమల్ ని దింపేశాడు

By:  Tupaki Desk   |   17 Jan 2018 4:09 AM GMT
కమల్ ని దింపేశాడు
X
కోలీవుడ్ లో మోస్ట్ టాలెంటెడ్ హీరోస్ లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి తన విలక్షణతను సినిమా సినిమాకు పెంచుకుంటూ పోతున్నాడు. ఆ మధ్య బాహుబలి 2 ని దాటి మరీ ఐఎండిబిలో ఫస్ట్ ప్లేస్ కొట్టేసిన విక్రం వేదా ఘన విజయంలో మాధవన్ కంటే ఎక్కువ పాత్ర పోషించింది విజయ్ సేతుపతినే.తన వయసును మించి పాత్రలను, రిస్క్ ను చేస్తున్న విజయ్ సేతుపతి ని చూసి అందరు భవిష్యత్ కమల్ హాసన్ అంటూ కితాబు ఇస్తున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టే తను కూడా ఎటువంటి ప్రయోగానికి అయినా సై అంటున్నాడు. మీరు పైన చూస్తున్న స్టిల్ సీతాకాతి అనే సినిమాలోనిది. అచ్చం భారతీయుడులో ముసలి కమల్ హాసన్ ను పోలి ఉన్న పాత్రలో విజయ్ మేకోవర్ చూసి అందరు నోరెళ్ళబెడుతున్నారు.

ఇందులో వయసు మళ్ళిన కురు వ్రుద్ధుడిగా విజయ్ సేతుపతి నటిస్తున్నాడు. పాత్ర తీరుతెన్నులు ఇంకా బయటికి చెప్పడం లేదు కాని చాలా డిఫరెంట్ సబ్జెక్టు అనైతే చెబుతున్నారు. ఈ మేకప్ వేసుకోవడానికి కనీసం నాలుగు గంటల టైం పడుతోందట. ప్రాస్తేటిక్స్ పద్ధతి ఉపయోగించి చేసే ఈ మేకప్ చేయించుకోవడానికి చాలా సహనం ఉండాలి. గతంలో శంకర్ ఐ కోసం విక్రం, భామనే సత్యభామనే కోసం కమల్, రోబో కోసం రజనికాంత్ దీనికి ఓకే చెప్పి ఆ పాత్రలను పండించారు. విజయ్ సేతుపతి కూడా అదే దారిలో ఉన్నాడు. గోవింద్ పి మేనన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ బాలాజీ తరీంతరన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

విజయ్ సేతుపతి నటిస్తున్న మొదటి తెలుగు సినిమా సైరా నరసింహరెడ్డి షూటింగ్ లో వచ్చే నెల నుంచి పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. చిరంజీవి వెంటే ఉండే నమ్మకస్తుడైన ఓబయ్య పాత్రలో విజయ్ సేతుపతి కనిపిస్తాడని టాక్. దీన్ని అఫీషియల్ గా అటు యూనిట్ కాని విజయ్ సేతుపతి కాని ఇప్పటి దాకా షేర్ చేయలేదు. అదే టీంలో బ్రహ్మాజీ, జగపతి బాబు కూడా ఉండబోతున్నారు అని మరో వార్త.