Begin typing your search above and press return to search.

సూప‌ర్ 30కి స్టూడెంట్స్ వార్నింగ్

By:  Tupaki Desk   |   15 Jun 2019 12:33 PM GMT
సూప‌ర్ 30కి స్టూడెంట్స్ వార్నింగ్
X
ఒక‌రిని హీరోని చేయాల‌న్నా.. జీరోని చేయాల‌న్నా అది ఫిలింమేక‌ర్ చేతిలో ఉంటుంది. బ‌యోపిక్ ల ట్రెండ్ లో ప్ర‌స్తుతం ఎంద‌రినో హీరోల్ని చేస్తున్నారు. కొంద‌రిని జీరోల్ని చేస్తున్నారు. ఆ క్ర‌మంలోనే కొన్ని బ‌యోపిక్ లు వివాదాల్ని నెత్తికెత్తుకొస్తున్నాయి. మొత్తానికి ఇదే హ‌డావుడిలో వ‌స్తున్న మ‌రో బ‌యోపిక్ సూప‌ర్ 30 వివాదాస్ప‌ద‌మైంది. ఈ సినిమాని గ‌ణిత‌శాస్త్ర మేధావి .. సైంటిస్ట్ ఆనంద్ కుమార్ జీవిత‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తున్నారు. హృతిక్ రోష‌న్ టైటిల్ పాత్రను పోషించారు. జూలై 12న సినిమా రిలీజ‌వుతోంది. అయితే రిలీజ్ ముందే ఈ సినిమా వివాదాల్ని మోసుకొచ్చింది.

ఆనంద్ కుమార్ జీవిత‌క‌థ‌ని వ‌క్రిస్తున్నారు. అత‌డిని పాజిటివ్ కోణంలో మాత్ర‌మే చూపిస్తున్నార‌ని య‌థార్థం వేరుగా ఉంద‌ని ఇటీవ‌ల ఓ న‌లుగురు ఐఐటీ విద్యార్థులు కోర్టుకెక్కిన సంగ‌తి తెలిసిందే. బ‌యోపిక్ మేక‌ర్స్ పై పిల్ వేశారు. ప‌లువురు పేద విద్యార్థుల‌కు ఉచితంగా ఐఐటీ-జేఈఈ వంటి ప‌రీక్ష‌ల‌కు కోచింగ్ ఇచ్చిన గొప్ప సేవ‌కుడిగా అత‌డిని చూపిస్తుండ‌డంపై అభ్యంత‌రం చెబుతున్నారు స్టూడెంట్స్. విద్యార్థికి రూ.33వేల ఫీజు చొప్పున దండుకుని అత‌డు ఉచితం అని ప్రచారం చేసుకున్నాడ‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అలాగే త‌న వ‌ద్ద శిక్ష‌ణ పొంది జేఈఈ పాసైన విద్యార్థుల జాబితాని రివీల్ చేయాల్సిందిగా ఆనంద్ కుమార్ ని కోరుతున్నారు. దీనిపై ఇంత‌వ‌ర‌కూ అత‌డు స్పందించ‌లేద‌ని వేలెత్తి చూపిస్తున్నారు.

అయితే ఈ సినిమాకి ఇప్ప‌టికే సెన్సార్ నుంచి క్లియ‌రెన్స్ వ‌చ్చేసింది. చెప్పిన తేదీకే రిలీజ్ చేస్తున్నామ‌ని మేక‌ర్స్ చెబుతున్నారు. అయితే ఆనంద్ కుమార్ జీవితంలోని ఓ కొత్త కోణం గురించి స్టూడెంట్స్ ఆరోపించాక ఆ దిశ‌గా మేక‌ర్స్ ఇన్వెస్టిగేష‌న్ స్టార్ట్ చేశార‌ని తెలుస్తోంది. అందులో వాస్త‌వ‌మెంత‌? అన్న‌దానిపై ఆరా తీస్తున్నార‌ట‌. ఇక ఈ చిత్రానికి వికాస్ బాల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన సంగ‌తి తెలిసిందే. మీటూ ఉద్య‌మం ... మ‌హిళా ఆర్టిస్టుల‌ ఆరోప‌ణ‌ల అనంత‌రం అత‌డిపై విచార‌ణ చేసిన క‌మిటీలు క్లీన్ చిట్ ఇవ్వ‌డంతో ప్ర‌స్తుతం అతడి పేరునే టైటిల్స్ లో వేస్తున్నార‌ని చెబుతున్నారు. అయితే అస‌లు ఆనంద్ కుమార్ జీవితంలో వాస్త‌వాలేంటి? అన్న‌ది తేలేలోపే సినిమా రిలీజ‌వ్వ‌డం ఖాయ‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. కోర్టుల ప‌రిధిలో ఈ వివాదం ఎలా ప‌రిష్కృతం అవుతుంది అన్న‌ది ఇప్ప‌టికైతే స‌స్పెన్స్.