Begin typing your search above and press return to search.

మహేష్ సుక్కులకు ఇంకా కుదరలేదట?

By:  Tupaki Desk   |   20 Oct 2018 7:34 AM GMT
మహేష్ సుక్కులకు ఇంకా కుదరలేదట?
X
స్టైలిష్ గా సినిమాలు తీస్తూ ప్రేక్షకుల మెదడుకు పరీక్ష పెట్టే దర్శకుడిగా పేరున్న సుకుమార్ మొదటిసారి పూర్తిస్థాయి కమర్షియల్ జానర్ ను టచ్ చేస్తూ కొత్త తరహాలో తీసిన రంగస్థలం సృష్టించిన రికార్డులు ఇంకా అలాగే భద్రంగా ఉన్నాయి. ఆ రేంజ్ సక్సెస్ తర్వాత నెక్స్ట్ మూవీ అందులోనూ ప్రిన్స్ మహేష్ బాబుతో అంటే సహజంగానే అంచనాలతో పాటు ఒత్తిడి ఉండటం సహజం. పైగా హైప్ మాములుగా కంటే ఓ ఐదారు రేట్లు ఎక్కువగా ఉంటుంది. అందుకే సుక్కు చాలా రోజుల నుంచి కథ మీద ఉన్నాడు.

అమెరికాకు మహేష్ వెళ్ళడానికి ముంచే ఒక లైన్ వినిపించాడట సుక్కు. నిజామ్ పాలనలో రజాకార్ల హయంలో జరిగిన సంఘటనలు ఆధారంగా సరికొత్త పాయింట్ తో అల్లుకున్న కథను చెప్పాడట. కానీ పీరియాడిక్ సినిమాలు ఈ మధ్య ఎక్కువగా వస్తున్న తరుణంలో ఇప్పుడు చేయటం ఎంత వరకు కరెక్ట్ అనే కోణంలో ఆలోచించి వేరేది చూడమని చెప్పాడట. దీంతో సుకుమార్ ఆప్షనల్ గా పెట్టుకున్న వేరే పాయింట్ ను డెవలప్ చేసే పనిలో ఉన్నాడట. మహర్షి పూర్తి కావడానికి ఇంకా టైం చాలా ఉంది కాబట్టి ఆ లోపు దీన్ని ఒక కొలిక్కి తేవచ్చనే ప్లాన్ లో సుక్కు ఉన్నట్టు తెలిసింది. ఎప్పుడు మొదలుపెట్టినా సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాదే ఉండేలా ఇప్పటికే మాట తీసుకున్నాడట.

మరి మహర్షి పూర్తయ్యే లోపే దీని షూటింగ్ మొదలుపెడతారా లేక మహేష్ ఫాలో అయ్యే ఒక సినిమా తర్వాత మాత్రమే మరొకటి అనే తరహాలో దానికి గుమ్మడి కాయ కొట్టాకే దీనికి టెంకాయ కొడతారా అనేది తెలియాల్సి ఉంది. ఈ కాంబోలో వచ్చిన 1 నేనొక్కడినే కమర్షియల్ గా ప్లాప్ అయినప్పటికీ సినిమా ప్రేమికులు దాన్ని క్లాసిక్ గానే వర్ణిస్తుంటారు. అలాంటిది మెప్పించే తరహాలో సుక్కు కానక మహేష్ తో తీస్తే ఇక ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా.