Begin typing your search above and press return to search.

నాన్న కత్తి.. అమ్మ చైన్.. బాహుబలి 2

By:  Tupaki Desk   |   24 Oct 2016 5:36 AM GMT
నాన్న కత్తి.. అమ్మ చైన్.. బాహుబలి 2
X
బాహుబలి2 ఫస్ట్ లుక్ వచ్చేసింది. సిక్స్ ప్యాక్ లుక్ తో ప్రభాస్ అదరగొట్టేస్తున్నాడు. రాజుల కాలంలో సిక్స్ ప్యాక్ లు ఉన్నాయా అంటూ డిస్కస్ చేసేసుకునే సోషల్ మీడియా జనాలు చాలామందే ఉన్నారు కానీ.. అంతకంటే ఆసక్తికరమైన చర్చ ఒకటి సాగుతోంది.

బాహుబలి తొలి భాగానికి సంబంధించి భుజాన శివలింగాన్ని మోస్తున్న శివుడు గెటప్ విపరీతమైన పాపులారిటీ సంపాదించింది. మొదటగా బయటకొచ్చిన లుక్ కూడా ఇదే. సినిమాలో ఆ సీన్ కి బోలెడంత ఇంపార్టెన్స్ ఉంటుంది. మరి రెండో భాగం ఫస్ట్ లుక్ లో కుడి చేతిలో కత్తి.. ఎడమ చేతిలో గొలుసు చుట్టుకున్న మహేంద్ర బాహుబలి కనిపిస్తున్నాడు. మహేంద్ర బాహుబలిగా మారిన శివుడు చేతిలో ఉన్న ఈ ఆయుధాల లెక్క ఏంటనే టాపిక్ పై హాట్ హాట్ గా డిస్కషన్స్ సాగుతున్నాయి. కత్తివరకు చూస్తే తండ్రి ఆయుధాన్ని చేతబట్టాడని చెప్పచ్చు. మరి ఈ చేతిలో ఉన్న చైన్ అయితే.. తల్లి దేవసేనను కట్టేసిన చైన్ అని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్.

తండ్రి కత్తి.. తల్లి గొలుసులే మహేంద్ర బాహుబలి ఆయుధాలు అన్నమాట. తల్లిదండ్రుల తరపున పగ తీర్చుకునే కేరక్టర్ కాబట్టి.. వారు గుర్తొచ్చేలా ఆయుధాలు చేత బట్టాడనే టాక్ కన్విన్సింగ్ గానే ఉందిలే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/