Begin typing your search above and press return to search.

యంగ్ టైగర్ ట్వీట్ వెనుక కథ ఇదేనా

By:  Tupaki Desk   |   20 April 2019 7:43 AM GMT
యంగ్ టైగర్ ట్వీట్ వెనుక కథ ఇదేనా
X
నిన్న జెర్సీ ని ప్రశంసిస్తూ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ పెట్టడం నందమూరి అభిమానుల్లో చర్చకు దారి తీసింది . స్వయానా బాబాయ్ తన తాతయ్య ఎన్టీఆర్ బయోపిక్ విడుదల చేసినప్పుడు కనీసం స్పందించని తారక్ ఇప్పుడు నాని సినిమాను ఇంత స్పెషల్ గా పొగడటం ఏమిటా అని సోషల్ మీడియా వేదికగా కొత్త ప్రశ్నలు లేవనేత్తుతున్నారు.

ఇక్కడ జూనియర్ ఫ్యాన్స్ బాలయ్య సినిమా ఆడలేదు కాబట్టి తమ హీరో సైలెంట్ గా ఉన్నాడని ఇప్పుడు జెర్సీ బాగుంది కాబట్టే నాలుగు మంచి మాటలు చెప్పాడని కౌంటర్ ఇస్తున్నారు. కాని బాలయ్య అభిమానులు మాత్రం జెర్సీ మొదటి రోజు సాయంత్రం ఆట పూర్తి కాకుండానే బ్లాక్ బస్టరని తెల్చినప్పుడు ఎన్టీఆర్ కథానాయకుడు ఫస్ట్ డే డీసెంట్ టాక్ వచ్చిన విషయాన్నీ గుర్తు చేస్తున్నారు. ఇదంతా తేలే వ్యవహారం కాదు కాని దీని వెనుక మరో కారణం కనిపిస్తోంది

జూనియర్ ఎన్టీఆర్ గత చిత్రం అరవింద సమేత వీర రాఘవ నిర్మించిన హారిక అండ్ హాసిని సిస్టర్ కన్సర్న్ గా వ్యవహరించే సితార బ్యానరే జెర్సీకి నిర్మాత . తాను త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్నప్పటికీ నుంచి వీళ్ళతో జూనియర్ కు మంచి బాండింగ్ ఉంది. అందుకే ఇలా స్పెషల్ ట్వీట్ చేసాడనే టాక్ ఉంది. ఒకవేళ అరవింద సమేత చేయకపోయి ఉంటే జెర్సీ ట్వీట్ తారక్ నుంచి వచ్చేదా అనే ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టమే. ఎందుకంటే మజిలికి చిత్రలహరికి జూనియర్ ఏమి చెప్పలేదు. సో జెర్సీకి మాత్రమే కాంప్లిమెంట్ ఇచ్చాడు అంటే ఇంతకంటే రీజన్ వేరే ఉంటుందని అనిపించడం లేదు.