Begin typing your search above and press return to search.

సప్తగిరి పేరు వెనుక పెద్ద కథే ఉంది

By:  Tupaki Desk   |   14 Jun 2019 10:21 AM GMT
సప్తగిరి పేరు వెనుక పెద్ద కథే ఉంది
X
కమెడియన్‌ సప్తగిరి అనగానే ప్రేక్షకులు ఠక్కున ఆయన చేసిన కామెడీ పాత్రలు గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వేస్తారు. ముఖ్యంగా ఆయన పరుగు మరియు ప్రేమ కథా చిత్రమ్‌ లలో చేసిన అమాయకపు కుర్రాడి పాత్ర అందరిని గిలిగింతలు పెట్టింది. కమెడియన్‌ గా మంచి పేరు దక్కించుకున్న సప్తగిరి హీరోగా కూడా పరిచయం అయ్యాడు. సప్తగిరి ఎక్స్‌ ప్రెస్‌ చిత్రంతో హీరోగా పరిచయం అయ్యి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత సప్తగిరి ఎల్‌ ఎల్‌ బి చిత్రం కూడా సప్తగిరికి మంచి పేరును తెచ్చి పెట్టింది. తాజాగా సప్తగిరి 'వజ్రకవచధర గోవింద' చిత్రంలో నటించాడు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా సప్తగిరి మాట్లాడుతూ తన అసలు పేరు సప్తగిరి కాదనే విషయం చెప్పుకొచ్చాడు. తాను సప్తగిరి అని పెట్టుకున్న పేరు వెనుక పెద్ద కథే ఉందన్నాడు. మా నాన్న గారు ఫారెస్ట్‌ డిపార్ట్‌ మెంట్‌ లో ఎంప్లాయి. ఆయన ట్రాన్సఫర్స్‌ అవుతూ ఉంటే పలు ప్రాంతాల్లో చదవాల్సి వచ్చింది. నాన్నకు నేను బాగా చదవాలని కోరిక. కాని ఇంటర్‌ పూర్తి అవ్వగానే చదువుపై ఆసక్తి పోయింది. ఆ సమయంలో తిరుపతి వెళ్లాను.

తిరుపతిలో ఆ రోజు రద్దీ తక్కువగా ఉంది. దైవ దర్శనం చేసుకుని బయటకు వచ్చాను. బయట నిల్చుని స్వామి వారు గోపురం చూస్తూ ఉన్నాను. ఆసమయంలో వెనుక నుండి ఒక స్వామి వారు నాయన సప్తగిరి పక్కకు తప్పుకో అన్నారు. ఆ స్వామి వారి వెనుక ఆయన శిష్యులు 70 మంది వరకు ఉన్నారు. నాయన సప్తగిరి అంటూ స్వామి వారు నన్ను పిలిచిన సమయంలో ఆయన శిష్యులు అంతా నన్ను చూసి ఆశీర్వదించినట్లుగా నవ్వారు. అప్పుడే నా పేరును వెంకట ప్రభు ప్రసాద్‌ నుండి సప్తగిరిగా మార్చుకున్నాను.

హైదరాబాద్‌ లో మల్టీ మీడియా నేర్చుకుంటాను అంటూ వచ్చాను. రెండేళ్లు కష్టపడ్డ తర్వాత అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఛాన్స్‌ వచ్చింది. ఏడు సంవత్సరాలు అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గా చేశాను. బొమ్మరిల్లు భాస్కర్‌ గారు నాలోని నటుడిని గుర్తించారు. ఆయన వద్ద అసిస్టెంట్‌ గా చేస్తున్న సమయంలోనే ఆయన నాకు నటుడిగా ఛాన్స్‌ ఇచ్చారని చెప్పుకొచ్చాడు.