సెక్స్ రాకెట్ : ఆ ఇద్దరి హీరోయిన్లలో టెన్షన్

Tue Jun 19 2018 11:37:29 GMT+0530 (IST)


చికాగో సెక్స్ రాకెట్ బయటపడడంతో టాలీవుడ్ ఉలిక్కిపడుతోంది. ఈ సందర్భంగా సెక్స్ రాకెట్ నడిపించిన కిషన్ మోదుగుమూడి-చంద్ర దంపతులను అరెస్ట్ చేసిన పోలీసులు వారినుంచి నిజాలు వెలికితీస్తున్నారు. తాజాగా ఈ సెక్స్ రాకెట్ లో ఇద్దరు టాప్ హీరోయిన్ల పేర్లు బయటకు వచ్చాయి. దీంతో ఆ హీరోయిన్లలో గుబులు మొదలైంది.తాజాగా అమెరికన్ పోలీసులు సెక్స్ రాకెట్ పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశారు. ఈ కాపీలో మొత్తం ఐదుగురు హీరోయిన్లను పలువురు బాధితుల గురించి ప్రస్తావించారు. ఈ పేర్లు జాతీయ మీడియాలో  విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి.

కిషన్ మోదుగుమూడి -చంద్ర దంపతులు  కొన్ని సంవత్సరాలుగా టాలీవుడ్ కోలీవుడ్ సాండిల్ వుడ్ హీరోయిన్లకు వీసాలు ఇప్పించి వ్యభిచారం చేయిస్తున్నారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే ఆ నివేదికలో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్స్ పేర్లను బయటపెట్టకుండా వారు వ్యభిచారం చేశారని మాత్రమే ప్రస్తావించారు. ఆ ఇద్దరి హీరోయిన్లు వీరేనంటూ తాజాగా మీడియాకు ఉప్పందింది. ఈ ఇద్దరు హీరోయిన్లు పలు హాట్ హాట్ సినిమాల్లో అందాలు ఆరబోసిన వారే.. ఒక హీరోయిన్ ఏమో ఓ యంగ్ హీరోతో  డేటింగ్ చేసింది. మరో హీరోయిన్ అయితే తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన దర్శకుడితో డేటింగ్ చేస్తోందని కథనాలు వెలువరించారు. ఈ వార్తలు జాతీయ స్థాయిలో బయటకు రావడంతో సదురు హీరోయిన్లలో టెన్షన్ మొదలైంది.

అంతేకాకుండా శ్రీరెడ్డితో పాటు పలువురు బాధితులు కూడా అమెరికన్ సెక్స్ రాకెట్ లో ఉన్నది వీరేనంటూ పలు హింట్స్ ఇస్తుండడంతో సదురు హీరోయిన్లు ఇరుకునపడుతున్నారు.  

అయితే ఈ విషయంపై కొందరు హీరోయిన్లు స్పందించారు. అమెరికాలో ఈవెంట్లలో పాల్గొన్న వారందరికీ ఈ రాకెట్ లో సంబంధం ఉందని అంటగట్టడం భావ్యం కాదని పేర్కొన్నారు. చాలా మంది హీరోయిన్లు సింగర్లు అమెరికాలో వివిధ కార్యక్రమాల్లో  పాల్గొన్నారని.. ఈ రాకెట్ విషయం తెలిసి వారంతా మధనపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.