Begin typing your search above and press return to search.

హాలీవుడ్ జోరుకి బ్రేకేసిన మొనగాడు

By:  Tupaki Desk   |   22 July 2016 7:32 AM GMT
హాలీవుడ్ జోరుకి బ్రేకేసిన మొనగాడు
X
ఈ ఏడాది హాలీవుడ్ సినిమాల జోరు ఇండియాలో బాగానే కనిపిస్తోంది. లోకల్ మూవీస్ కి పోటీగా.. ఆ మాటకొస్తే ఇక్కడి సినిమాలకు మించి కూడా వసూళ్లు సాధిస్తున్నాయి. సుల్తాన్ వచ్చే వరకూ 2016 లో టాప్ గ్రాసింగ్ మూవీగా జంగిల్ బుక్ నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇండిపెండెన్స్ డే2 కి కూడా మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు జూలై 22న విడుదలవుతోన్న స్టార్ ట్రెక్ బెయాండ్ మూవీపై కూడా ఈ స్థాయి అంచనాలే ఉన్నాయి.

ఇప్పటికే స్టార్ ట్రెక్ సిరీస్ లో 2 సినిమాలు రాగా.. ఇది మూడో భాగం. సూపర్ స్టార్ రజినీకాంత్ మూవీ కబాలి లేకపోతే.. కచ్చితంగా ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వచ్చేవి. కానీ సూపర్ స్టార్ సృష్టిస్తున్న సునామీ ముందు.. ఈ గ్రహాంతరవాసుల సినిమా మన జనాలకు పెద్దగా ఆనడం లేదు. ఎంత పెద్ద మూవీ అయినా.. ఇంటర్నేషనల్ గా ఎన్ని అంచనాలున్నా.. అవన్నీ కబాలి ముందు దిగదుడుపు అయిపోయాయి.

గతకొన్ని నెలలుగా కబాలిపై ఇక్కడ ఉన్న బజ్ కారణంగా.. ఆ సినిమాతో పోటీకి వేరే ఎవరూ సాహసించలేదు. అయినా సరే ఈ స్టార్ ట్రెక్ ఇదే డేట్ కి రావడానికి కారణం ఇది ఇంటర్నేషనల్ రిలీజ్. అయితే.. కబాలి ప్రభంజనంలో కొట్టుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా హాలీవుడ్ జోరుకి కూడా బ్రేకేసిన మొనగాడుగా నిలిచాడు మన కబాలి అలియాస్ రజినీకాంత్.